Home తాజా వార్తలు పసిడి బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభం

పసిడి బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభం

Gold bond issue price fixed at Rs 5,104 per gram

 

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక ఏడాదికి సంబంధించి పసిడి బాండ్ల విక్రయ ప్రక్రియ సోమవారంనాడు ప్రారంభం అయ్యింది. జనవరి 15న శుక్రవారం ఇష్యూ ముగుస్తుంది. గ్రాము ధర రూ. 5,104 గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ. 50 ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ పెట్టుబ్డుదారులు ఇది ఉత్తమమైన మార్గమని నిపుణులు అభిప్రాయం. దీనిలో రెండు రకలా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై సంవత్సరానికి 2.5% స్థిర వడ్డీని పొందడంతో పాటు, బంగారం ధర పెరిగితే ఆ లాభాన్ని కూడా పొందవచ్చు. 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జనవరి 1 వరకు జారీచేసిన్ బాండ్ల (సిరీస్ IX) ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 5,000. వీటిని భారత ప్రభుత్వం తరపున ఆర్‌బిఐ జారీ చేస్తుంది. 2019, 2020 సంవత్సరాల్లో బంగారం మంచి లాభాలను సాధించింది, రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఆగస్టులో బంగారం 10 గ్రాములకు రూ.56,200 వద్దకు చేరింది. కొంతకాలంగా రూ. 48,000 -52000 పరిధిలో ట్రేడవుతోంది.

Gold bond issue price fixed at Rs 5,104 per gram