Friday, April 19, 2024

రంగుల్లో ట్విట్టర్ ‘టిక్’లు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : బిలియనీర్ ఎలోన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ట్విట్టర్‌లో అనేక మార్పులు చేస్తున్నారు. వచ్చే వారం నుంచి ధృవీకరించిన టిక్ మార్క్‌లను వివిధ రంగుల్లో ప్రారంభించనున్నామని మస్క్ ప్రకటించారు. యాక్టివేషన్‌కు ముందు మాన్యువల్‌గా గుర్తించిన వాటికి ధృవీకరణ టిక్‌లను ఇస్తారు. గోల్డ్ టిక్ మార్క్‌ను కంపెనీలకు, గ్రే కలర్ టిక్‌ను ప్రభుత్వ ఖాతాలకు ఇస్తారు. సెలబ్రిటీలు కావొచ్చు లేదా కాకపోవచ్చు అయినప్పటి వారికి వ్యక్తులకు మాదిరిగానే బ్లూ టిక్‌లను ఇస్తారు. ట్విట్టర్ తన బ్లూ చెక్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 2న మళ్లీ ప్రారంభిస్తుందని మస్క్ తెలిపారు. ఎలోన్ మస్క్ ఒక ట్వీట్‌లో కంపెనీలకు గోల్డ్ టిక్, ప్రభుత్వాలకు గ్రే టిక్, సెలబ్రిటీలు లేదా ఇతర వ్యక్తులకు బ్లూ టిక్ ఉంటుంది.

ప్రతి నెలా చెల్లించాలి..

కంపెనీ ఇటీవల ప్రకటించిన 8 డాలర్లు బ్లూ చెక్ సబ్‌స్క్రిప్షన్ కారణంగా నకిలీ ఖాతాలు వేగంగా పెరిగాయి. దీని తర్వాత ఈ సేవలను నిలిపివేశారు. బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సేవ నవంబర్ 29న పునఃప్రారంభిస్తారమని ప్రకటించారు. ట్విట్టర్ బ్లూ కోసం వినియోగదారులు రుసుము చెల్లించాలి. భారతీయులు నెలకు రూ.719 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము సామాన్యులకు ఎక్కువే, అయితే వివిధ దేశాలలో కొనుగోలు శక్తి ఆధారంగా ధర నిర్ణయిస్తామని మస్క్ గతంలో చెప్పారు.

నిషేధిత ఖాతాలు పునరుద్ధరించవచ్చు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ట్విట్టర్ హ్యాండిల్‌ను పునరుద్ధరించిన తర్వాత ఇతర నిషేధిత ఖాతాలకు కూడా అవకాశం ఇవ్వనున్నామని ఎలోన్ మస్క్ తెలిపారు. వచ్చే వారం నుంచి రద్దు చేసిన అకౌంట్లకు క్షమాభిక్ష గ్రాంట్ చేస్తామని అన్నారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపారు, క్షమాపణ వచ్చే వారం ప్రారంభమవుతుందని మస్క్ ట్విట్టర్‌లో అన్నారు. ట్విట్టర్‌లో బ్లూ టిక్ కోసం ప్రతి నెల 8 డాలర్లు చెల్లించే వినియోగదారులు మరిన్ని సౌకర్యాలను పొందుతారని ఎలోన్ మస్క్ చెప్పారు. ఇందులో యూజర్లకు రిప్లై ఇవ్వడంలో, సెర్చ్ చేయడంలో ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా స్పామ్, బాట్ ఖాతాలను తొలగించడం సులభం అవుతుంది. లాంగ్ వీడియోలు, ఆడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసే సౌలభ్యాన్ని కూడా యూజర్లకు కల్పించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News