Home నాగర్ కర్నూల్ బంగారు తెలంగాణ ముందుంది

బంగారు తెలంగాణ ముందుంది

Gold is ahead of Telangana

కవి సమ్మేళనంలో కవుల భావన

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ టౌన్: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందున బంగారు తెలంగాణ త్వరలోనే సాకారం అవుతుందని కవులు తమ కవితల ద్వారా వారి భావనలను తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 1 నుంచి 3 వరకు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమంలో భాగం గా ఆదివారం సాయిగార్డెన్స్‌లో కవి సమ్మేళనం ముసాయిదా కార్యక్రమం నిర్వహించారు. బంగారు తెలంగాణ అనే శీర్షికతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 110 కవులు, రచయితలు సమ్మేళనంలో పాల్గొన్నారు. మన చేతిలోనే నిధులు, నీళ్లు, ఉద్యోగులు ఉన్నందున బంగారు తెలంగాణ లక్ష సాధన ఎంతో దూరంలో లేదని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి అమలు చేస్నున్నందున వాటి ఫలితాలు ప్రజలకు చేరుతున్నాయని, అందుకే త్వరలో బంగారు తెలంగాణ కళ్ల ఎదుటే కనిపిస్తుందన్నారు. అనంతరం కవులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిపిఆర్‌ఒ రామ్మోహన్‌రావు, కవులు గుడిపల్లి నిరంజన్, వనపట్ల సుబ్బయ్య, గోదానం మురళీదర్‌రావు, దినకర్‌రావు, వహిద్‌ఖాన్, ముత్యాల కృష్ణయ్య, రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.