Saturday, April 20, 2024

రూ.51 వేలకు చేరువలో బంగారం

- Advertisement -
- Advertisement -

Gold is approaching Rs 51000

 

న్యూఢిల్లీ : బంగారం ధరలు మరింతగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు పసిడి ధరలు క్షీణించాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.631 పడిపోయి రూ.51,367కు చేరింది. వెండి కూడా పసిడి బాటలో పయనించింది. కిలో వెండి ధర రూ.1,681 పడిపోయి రూ.62,158కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్ పసిడి ధర 1,896 డాలర్లకు, వెండి ఔన్స్ 24.16 డాలర్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ మాట్లాడుతూ, బంగారం ధర స్వల్పంగా పెరుగుదల చూసినప్పటికీ ఈ వారం ప్రారంభం నుంచి 1900 డాలర్ల దిగువనే ఉందని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News