Home తాజా వార్తలు పండుగ వేళ తగ్గిన బంగారం ధరలు

పండుగ వేళ తగ్గిన బంగారం ధరలు

Gold latest price in hyderabad

 

సంక్రాంతి పండగ వేళ బంగారం ధరలు తగ్గాయి. వెండి రేటు మాత్రం స్వల్పంగా దిగొచ్చింది. మరి హైదరాబాద్ లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000గా ఉంది. ఒక్క గ్రాము బంగారం రూ.4,500కి లభిస్తోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల మేలిమి పసిడి ధర కూ రూ. 120 తగ్గి రూ.49,100గా నమోదైంది. ఒక్క గ్రాము బంగారం రూ.4,91 అందుబాటులో ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే తులం పసిడి ధరలు ఇలా ఉంటే మరి దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎక్కడ ఎంత ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. చెన్నైలో 22 క్యారెట్ 45,450,  24 క్యారెట్ రూ.49,590కి లభిస్తోంది.

ముంబైలో 22 క్యారెట్ రూ.46,980, 24 క్యారెట్ రూ.48,980 పలుకుతోంది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.47,150గా ఉంటే.. 24 క్యారెట్ రూ.51,440. కోల్‌కతాలో 22 క్యారెట్ రూ.47,300, 24 క్యారెట్ రూ.50,000. బెంగళూరులో 22 క్యారెట్ రూ.45,000, 24 క్యారెట్ రూ.49,100. గడిచిన 10 రోజుల్లో బంగారం రేటు ఐదు సార్లు పెరిగింది. మరో  మూడు సార్లు తగ్గింది. రెండు సార్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తులం వెండి ధర రూ.659 ఉండగా.. 10 గ్రాములకు ఒక్క రూపాయి తగ్గింది. అయితే కేజీ వెండి రూ.65,900కి లభిస్తోంది. హైదరాబాద్ లో కేజి వెండి ధర రూ.65,900గా కోనసాగుతోంది.

Gold latest price in hyderabad