Wednesday, April 24, 2024

ఎమర్జింగ్ టెక్నాలజిలో తెలంగాణకు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

Emerging Technology

 

హైదరాబాద్ : సాంకేతిక అభివృద్ధి (ఎమర్జింగ్ టెక్నాలజీ)లో తెలంగాణకు బంగారు పతకం లభించింది. రాష్ట్రంలో చిట్ ఫండ్ల నిర్వహణలో మెరుగైన సాంకేతిక నైపుణాన్ని వినియోగిస్తున్నందుకు లభించింది. బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్, టి -చిట్స్, ఇ -గవర్నెన్స్ 2019-20కి 23వ జాతీయ సదస్సు కింద ‘ఎక్సలెన్స్ ఇన్ అడాప్టింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‘ లో రాష్ట్రానికి ఈ గౌరవం దక్కింది. దీంతో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దేశంలో తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఐటి, ఇ అండ్ సి డిపార్టుమెంట్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ఉంది.

ముఖ్యంగా ప్రభుత్వ విభాగాలకు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ సాంకేతికత పనిచేస్తుంది. ప్రజలు తమ భవిష్యత్ అవసరాలకు డబ్బు ఆదా చేయడంలో చిట్‌ఫండ్ సంస్థలు సహాయపడుతున్నాయి. అయితే వాటి నియంత్రణ వైఫల్యాల కారణంగా లక్షల మంది ప్రజలు తమ జీవితకాల పొదుపును కోల్పోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌చెయిన్ సాంకేతిక పరిజ్ఞా నంతో లావాదేవీలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవకాశముంటుందని, సురక్షితమైన లావాదేవీలకు కేరాఫ్‌గా ఉంటుందని ప్రభుత్వ ఐటి విభాగం, ఎమర్జింగ్ టెక్నాలజి డైరెక్టర్ రామాదేవి లంకా అన్నారు. ‘సామాజిక మంచి కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి టి- చిట్స్ సరైన ఉదాహరణ.

Gold Medal for Telangana in Emerging Technology
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News