Tuesday, April 23, 2024

కరాటే ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్.. క్రీడాకారిణికి అభినందన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బ్లాక్ బెల్ట్‌లో గోల్డ్ మెడల్ సాధించి నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ రెసిడెన్సియల్ స్కూల్ విద్యార్థిని నామ నితన్య శ్రీని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ మేరకు సోమవారం నాడు తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అభినందించి ఈ సందర్భంగా మాట్లాడుతూ నామ నితన్య శ్రీ ప్రస్తుతం మెదక్‌లో 9వ తరగతి చదువుతోందని, ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఫస్ట్ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్‌షిప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2023లో బ్లాక్ బెల్ట్‌లో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎంఎల్‌ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నితన్య శ్రీ తండ్రి కృష్ణ , తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News