Home తాజా వార్తలు సువర్ణ తాపడంతో యాదాద్రి గర్భాలయ ముఖద్వారం

సువర్ణ తాపడంతో యాదాద్రి గర్భాలయ ముఖద్వారం

Gold plating for yadadri temple sanctorum gates

 

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీవైకుంట వాసు ను ద్వారాని తలపించే విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని గర్బాల ముఖద్వార వైభ వం స్వర్ణ కాంతులతో వెలుగుతుంది. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారి స్వయంబు గర్భా లయ ముఖ ద్వారం ఇత్తడితో పూర్తిచేసి స్వర్ణ తాపడం పనులు పూర్తి అయినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. శుక్రవారం రోజు న గర్బాలయ ముఖ ద్వారానికి పూర్తి అయిన బంగారు తాపడం(తోడుగు) పనులను ఆలయ ఈవో కాంట్రాక్టర్ రవింద్రన్ తో కలిసి పరిశీలన చేశారు. స్వామివారి గర్బాల ముఖ ద్వారం 13.5 అడుగుల ఎత్తుతో 10 అడుగుల వెడల్పుతో ఆగమ శాస్త్ర ప్రకారం తయారు చేయడం జరిగిందని ఇతడి లోహంతో తయారి చేసిన ద్వారానికి బంగారు తాపడం నిర్వహించారు.

ముఖ ద్వార తయారిలో రెండు తలుపులు 54 చతురస్రాకారంలో, శంకు చక్రం నామాలతోపాటు 14 నారసింహ విగ్రహాలను, 36 కమల పుష్పాలను, 36 గంటలను అమర్చగా ద్వార బంద న చిలుక ఆకారంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పెంబార్తి చెందిన స్వర్ణ కలకారులచే ఇత్తడితో ద్వారం చెప్పిచిన వైటిడిఏ అధికారులు బంగారుతాపడం పనులను చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ సంస్థద్వార తాపడం పనులు పూర్తి చేసినట్లు తెలిపా రు. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు పూర్తికాగ మిగిలిని పనులను త్వరగతిన పూర్తి జరిగేల వైటిడి ఏ అధికారులు చూస్తున్నారు. గర్బాలయంలో ద్వజ స్తంభంకు సంప్రోక్షణ, సప్త రాజగోపారాలకు శిఖరాలకు బిగించే పూజలను నిర్వహించి ఉన్నా రు. ఆలయ ప్రారంబోత్సవం నాటికి శాస్త్రనుసారం ద్వాజస్తంభం పూజలను నిర్వహించుటకు ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

Gold plating for yadadri temple sanctorum gates