Home తాజా వార్తలు తులం బంగారం రూ. 52,200

తులం బంగారం రూ. 52,200

Gold price may cross rs 52000 per 10 grams in India

 

అదే బాటలో వెండి
ఆల్‌టైమ్ రికార్డు ధర పలికిన పసిడి

ముంబై : దేశీ మార్కెట్లలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.52 వేలను తాకింది. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎంసిఎక్స్‌పై ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ రూ.800 పెరిగి రూ.51,833కు (10 గ్రాములు) రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో డిమాండ్ కారణంగా దేశీయ మార్కెట్లోనూ బంగారం రేటు పెరుగుతోంది. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది.

సిల్వర్ ఫ్యూచర్స్ 5.5 శాతం అంటే రూ.3,400 పెరగడంతో కిలో ధర రూ.64,617కు చేరింది. గత వారం బంగారం ధరలు నాలుగు శాతం పెరగ్గా, వెండి 15 శాతం పెరిగింది. ప్రపంచ మార్కెట్లలో అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర అత్యధిక స్థాయికి పెరిగింది. అలాగే బలహీనమైన యుఎస్ డాలర్, ఉద్దీపన ప్యాకేజీ ఆశలు పెట్టుబడిదారులను బంగారం వంటి సురక్షిత ఎంపికల వైపు మొగ్గుచూపేలా చేశాయి. అంతర్జాతీయంగా ఔన్స్ పసిడి ధర 1.5 శాతం పెరిగి 1,928.40 డాలర్లకు చేరుకుంది. ఇది సెప్టెంబర్ 2011 గరిష్ట స్థాయి 1,920.30 డాలర్లను అధిగమించింది.

Gold price may cross rs 52000 per 10 grams in India