Thursday, February 2, 2023

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

- Advertisement -

Gold-priceన్యూఢిల్లీ : బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. గురువారం రూ.348 పెరిగి 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.39,115గా నమోదైంది. దీంతో బంగారం రూ.40వేలకు చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం వర్తకం బలంగా ఉండడం, రూపాయి విలువ క్షీణించి పోవడం కారణంగా వీటి ప్రభావం బంగారం ధరలపై మరింత పడిందని సీనియర్ విశ్లేషకులు టపన్ పటేల్ తెలిపారు. బంగారం బాటలో కూడా వెండి పయనించింది.

వెండి ద్వారా రూ.1630 పెరిగి కిలోగ్రాముకు రూ.47,580కు ఎగబాకింది. ప్రపంచ మార్కెట్ ప్రకారం బంగారం ధర న్యూయార్క్‌లో ఒక ఔన్సు యుఎస్‌డి 1,501గా, వెండి ధర ఒక ఔన్సు యుఎస్‌డి 17.61గా ఉంది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.38.767, సిల్వర్ కిలో గ్రాము ధర రూ.45.950గా ఉన్న విషయం తెలిసిందే.

Gold price rises Rs 348 to Rs 39115 Know latest gold

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles