Home తాజా వార్తలు బంగారం ధరలు పైపైకి …

బంగారం ధరలు పైపైకి …

Gold rate today jumps on US-China tensions

 

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులు, అమెరికా, చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరగడం వంటి పరిణామాల వల్ల బంగారం ధరలు పైపైకి ఎగసిపడుతున్నాయి.

ఎంసిఎక్స్ లో బంగారం ధరలు 0.33 శాతం అంటే రూ.152 పెరిగి రూ.46,557కు (10 గ్రాములు) చేరింది. భారత్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.34 శాతం పెరిగి కిలో రూ.48,999కి చేరుకుంది. పసిడి ధరలు మే నెల ప్రారంభంలో రూ. 45,556 ఉండగా.. 15వ తేదీన రూ. 47,360 పెరిగి, ఆ తర్వాత కాస్త తగ్గుతూ వచ్చింది. శుక్రవారం రూ.46,550 కంటే పైకి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగిన బంగారం ధర ఔన్స్ 1,719.63 డాలర్లకు చేరింది.

యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్‌ 0.4 శాతం ఎగిసి 1,734.60 డాలర్లు పలుకగా.. పల్లాడియం ఔన్స్ 1,930.67 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఔన్స్ 0.9 శాతం తగ్గి 830.81 డాలర్ల వద్ద, వెండి 0.3 శాతం తగ్గి ఔన్స్ 17.38 డాలర్లు పలికింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,100 వద్ద ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.44,3100 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.48,500 పలుకుతున్నది.

Gold rate today jumps on US-China tensions