Home జాతీయ వార్తలు అన్నా విమానాశ్రయంలో బంగారం పట్టివేత

అన్నా విమానాశ్రయంలో బంగారం పట్టివేత

Goldచెన్నయ్ : విమానాశ్రయాల్లో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నా విమానాశ్రయంలో అధికారులు మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ కోటిన్నర రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అనునిత్యం విమానాశ్రయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కొందరు విదేశాల నుంచి భారత్ కు విమానాల ద్వారా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో వారు పోలీసులకు పట్టుబడి కటకటాల పాలవుతున్నారు.

Gold Seized At Anna Airport In Tamil Nadu