Home తాజా వార్తలు భారీగా బంగారం పట్టివేత

భారీగా బంగారం పట్టివేత

Goldరంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుపడింది. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న సుడాన్ దేశస్థురాలిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.  పట్టుబడిన బంగారం విలువ రూ.55 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. శనివారం రాత్రి దుబాయ్ నుంచి హైదరాబాదుకు వచ్చిన సుడాన్ దేశస్థురాలి లగేజీని తనిఖీ చేశారు. ఈ క్రమంలో బంగారాన్ని బిస్కెట్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆమెపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Gold Seized at Shamshabad Airport