Friday, April 26, 2024

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుడు దుబయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుడు బట్టల లోని చీరపై గోల్డ్ స్ప్రే రూపంగా 461, గ్రాముల బంగారాన్ని అమర్చి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నంచి అడ్డంగా దొరికిపోయాడు. కస్టమ్స్ అధికారులు అతని కదలికలపై అనుమానంతో తాను తీసుకువచ్చిన లగేజ్ బ్యాగులను చెక్ చేయగా అందులో బంగారం ఉన్నట్టు గుర్తించిన ఎయిర్పోర్ట్ కస్టమ్స్

అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారు 28 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇలా తరచూ అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్న స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు వెంటనే వారిని పసిగట్టి అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. స్మగ్లర్లు ఎంతో తెలివిగా బంగారాన్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు వారిని తమదైన శైలిలో గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News