Friday, March 29, 2024

నగరంలో గోల్డ్ ఎటిఎం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: డబ్బుల మాదిరిగా ఇప్పుడు బంగారాన్ని కూడా ఏటీఏం ద్వారా డ్రా చేసుకునే అవకాశాన్ని గోల్డ్‌ సిక్కా స్టార్టప్ కంపెనీ కల్పించింది. శనివారం బేగంపేటలోని గోల్డ్‌ సిక్కా హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ కంపెనీ, ఓపెన్‌క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్నాలజీ సహాకారంతో తన మొదటి గోల్డ్ ఏటీఏంను తన కార్యాలయంలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోల్డ్‌ సిక్కా గోల్డ్ ఏటీఏం పెట్టడం మంచి పరిణామమన్నారు. ఒకప్పుడు ఏటీఏం నుంచి డబ్బులు తీసుకునే వాళ్లం, కాని ఇప్పుడు అదే ఏటీఏం నుంచి గోల్డ్ తీసుకొవడం అంటే మన టెక్నాలజీ ఎంతగా ఎదిగిపోయిందో అర్థమవుతోందని, అదీ కూడా మొదటిగా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం సంతోషించాల్సిన విషయమని తెలిపారు.

ఇలాంటివి సామాన్య మనుషులకు బాగా ఉపయోగపడనుందన్నారు. గోల్డ్‌ సిక్కా సిఈఓ సైయ్యద్ తరుజ్ మాట్లాడుతూ.. వినియోగదారులు బంగారాన్ని కొనులు చేసే విధానంలో గోల్డ్‌ఎటిఎం మెషిన్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని కంపెనీ ప్రకటించడం సంతోషంగా ఉంది. మా గోల్డ్ ఏటీఏంలతో, బంగారాన్ని కొనుగోలు చేయడం అనేది ఏదైనా సాధారణ ఏటీఏం నుండి డబ్బును విత్‌డ్రా చేయడం అంత సులభమని, కస్టమర్‌లు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లలో దేనినైనా ఉపయోగించి ఈ ఏటీఏంల నుండి బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చాన్నారు. ఈ ఏటీఏంలు 0.5 గ్రాములు, 1 గ్రాములు, 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాములు, 50 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు వివిధ విలువలలో బంగారు నాణేలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ధరలు వినియోగదారులకు పారదర్శకంగా, స్పష్టంగా ఉండేలా స్క్రీన్‌పై ప్రత్యక్షంగా ప్రదర్శించబడతాయి. నాణేలు 999 స్వచ్ఛతతో ధృవీకరించబడిన ట్యాంపర్ ప్రూఫ్ ప్యాక్‌లలో పంపిణీ చేయబడుతాయని, తద్వారా కస్టమర్ల డబ్బుకు పూర్తి విలువను అందిస్తాయి. ఈ కార్యక్రమంలో గోల్డ్‌ సిక్కా లిమిటెడ్ చైర్‌పర్సన్ అంబికా బర్మన్, గోల్డ్‌క్కా సిఈఓ సై తరుజ్, ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ పి. వినోద్ కుమార్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రెసిడెంట్ కొండూరు రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News