Home స్కోర్ అమెరికాకు స్వర్ణం

అమెరికాకు స్వర్ణం

wintr వింటర్ ఒలింపిక్స్
ప్యాంగ్‌చాంగ్: దక్షిణ కొరియాలో జరుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో అమెరికా తొలి స్వర్ణం సాధించింది. పురుషుల స్నోబోర్డ్ విభాగంలో అమెరికా స్టార్, 17 ఏళ్ల రెడ్ గెరాడ్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఈ పోటీల్లో అమెరికాకు ఇదే మొదటి స్వర్ణం కావడం విశేషం. ఆదివారం జరిగిన పోటీల్లో గెరాడ్ అసాధారణ పోరాట పటిమతో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. అతనికి కెనడా అథ్లెట్ల నుంచి గట్టి పోటీ ఎదురైంది. కీలక సమయంలో స్కోరింగ్‌ను పెంచుకున్న గెరాడ్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోరులో గెరాడ్ 43.33, 46.40 స్కోరు సాధించి తన ఆధిక్యాన్ని 87.16కు పెంచుకున్నాడు. ప్రత్యర్థులు మాక్స్ పారట్, మార్క్ మెక్ మోరిస్‌లు రజత, కాంస్య పతకాలతో సంతృప్తి పొందారు. ప్రతికూల వాతావరణంలోనూ గెరాడ్ అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల పోటీని తట్టుకుంటూ ముందుకు సాగి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు.
హాకీలో విజయం..
మరోవైపు మహిళా ఐస్ హాకీలో కూడా అమెరికా జట్టు విజ యం సాధించింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అమెరికా ఉమెన్స్ జట్టు 31 తేడా తో ఫిన్‌లాండ్‌ను ఓడించింది. ప్రారం భం నుంచే అమెరికా దూ కుడైన ఆటను కనబరిచింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుం డా ఆడుతూ ఘన విజయాన్ని దక్కించుకుంది.

నార్వే క్లీన్‌స్వీప్

wntr

పురుషుల స్కియథ్లాన్‌లో నార్వే క్లీన్ స్వీప్ సాధించింది. ఈ క్రీడాంశంలో నార్వే మూడు పతకాలు గెలుచుకొని తన సత్తాను చాటింది. పురుషుల స్కియథ్లాన్‌లో సిమెన్ క్రుగర్ స్వర్ణ పతకం సాధించాడు. ఈ విభాగంలో మిగిలిన పతకాలు కూడా నార్వే ఖాతాలోకే వెళ్లాయి. క్లిష్టమైన పరిస్థితులను సైతం తట్టుకొని క్రుగర్ రేసును పూర్తి చేసి స్వర్ణం దక్కించుకున్నాడు. జోహెన్నస్ కలెబో కూడా అద్భుత ప్రతిభతో పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలావుండగా పురుషుల 5వేల మీటర్ల స్పీడ్ స్కేటింగ్‌లో నెదర్లాండ్ ఆటగాడు స్వెన్ క్రమర్ పసిడి పతకం గెలుచుకున్నాడు. వింటర్ ఒలింపిక్స్‌లో క్రమర్‌కు ఇది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన క్రమర్ ప్రత్యర్థులకు అందనంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుని తన ఖాతాలో పసిడి పతకాన్ని జమచేసుకున్నాడు.