- Advertisement -
కోబ్రా : ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ పట్టణంలో భారీ దోపిడి జరిగింది. టౌన్లో ఉన్న బ్రహ్మ రోడ్డులో గల మణప్పురం గోల్డ్‌లోన్‌లో సాయుధులైన దుండగులు సుమారు రూ.3 కోట్ల విలువ చేసే 12.8 కిలోల బంగారం, రూ.1.30 లక్షల నగదు అపహరించుకుపోయారు. ఐదుగురు దొంగలు ఆయుధాలు, ముఖాలకు మాస్కులు ధరించి ప్రవేశించారు. అందరిని బందీలుగా చేసి సొమ్ము దోచుకుపోయారు. వెళ్తూ.. సిసిటివి కెమెరాలు, ఫూటేజీలను కూడా ఎత్తుకుపోయినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని షాపుల్లో ఏదైనా సిసిటివి లభిస్తుందేమోనని పరిశీలిస్తున్నారు.
- Advertisement -