18 ఏళ్లకే ప్రపంచ టైటిల్. మరో 12 ఏళ్లు గడిచేసరికి అతని ఖాతాలో 15 ప్రపంచ టైటిళ్లు. బరిలోకి దిగితే ప్రత్యర్థి ఎంతటి వాడైనా మోకరిల్లాల్సిందే. బిలియర్డ్ ఫార్మాట్ అయినా, స్నూకర్ ఫార్మాట్ అయినా.. అతని అంతిమ లక్షం టైటిలే. క్రికెట్‌ను అమితంగా ప్రేమించే భారత అభిమానుల భాషలో అతనో సచిన్. అతనే భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అర్జన్ అద్వానీ. 30 ఏళ్లకే ఏ భారత క్యూయిస్ట్కు సాధ్యం కాని రికార్డులు సొంతం చేసుకున్న పంకజ్‌ను కొందరు గోల్డెన్ బాయ్ అంటే మరికొందరు ఫ్రిన్స్ ఆఫ్ ఇండియా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.
క్రీడా విభాగం
పంకజ్ అద్వానీ.. భారత్‌లో అంతగా ప్రేక్షకాదరణ లేని బిలియర్డ్ అండ్ స్నూకర్ ప్లేయర్(క్యూయిస్ట్). భారత అభిమానులు తనను గుర్తించినా, గర్తించకపోయినా ఎన్నాడు పట్టించు కొని ఈ బెంగళూరు బాయ్ తనకు తెలిసిన ఆటనే ప్రాణంగా ప్రేమించి అందులో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. పదేళ్ల వయసులోనే పంక జ్‌కు స్నూకర్పై ఉన్న ఆసక్తిని గమనించిన సోద రుడు శ్రీ అద్వానీ తల్లిదండ్రులను ఒప్పించి భారత మాజీ స్నూకర్ ఛాంపియన్ అర్వింద్ సవుర్ కోచింగ్ సెంటర్లో చేర్పించడం అతని దశనే మార్చింది. అర్వింద్ కోచింగ్‌లో రాటు దేలిన పంకజ్.. 12 ఏళ్ల వయసులో తన తొలి స్నూకర్ టైటిల్‌ను నెగ్గాడు. ఇక అక్కడి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నో రికా ర్డులు సృష్టించాడు. 2000లో ఇండియన్ జూని యర్ బిలియర్డ్ ఛాంపియన్స్‌షిప్ టైటిల్‌ను, 2003లో ఇండియా జూనియర్ స్నూకర్ ఛాంపియ న్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టైటిళ్లను గెలిచి న అత్యంత పిన్న వయస్కుడిగా ఇప్పటికీ పంకజ్ పేరిటే రికార్డు ఉండడం విశేషం.
ఛాంపియన్లకు షాకిచ్చి
అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్షిప్(ర్యాంకింగ్ ఈవెంట్) మెయిన్ స్టేజ్‌కు ఓ కొత్త క్యూయిస్ట్ అర్హత సాధించాలంటే కనీసం నాలుగు విజయాలు (అంత ర్జాతీయ స్థాయిలో) సాధించాలి. అయితే పం కజ్ తన నాల్గో అంతర్జాతీయ టోర్నీ ప్రాతినిధ్యం లోనే దీనిని సాధించాడు. 2002లో తొలిసారి అంత ర్జాతీయ స్థాయి టోర్నీకి ప్రాతినిధ్యం వహించిన పం కజ్ 2003లో చెంగ్డూ(చైనా) అంతర్జాతీయ టోర్నీలో భాగంగా ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ స్టీవ్ డెవిస్, అలెన్ మెక్మానస్, క్రైగ్స్టెడ్మాన్, మైకే ల్ హోల్ట్‌ను వరుస మ్యాచ్‌ల్లో ఓడించి మెయిన్ స్టేజ్ పోటీలకు అర్హత సాధించాడు. అదే ఏడాది ఐబిఎస్ ఎఫ్ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ నెగ్గిన పంకజ్ ఈ టైటిల్ నెగ్గిన పిన్నవయస్కుడు(భారతీయుడు)గా రికార్డుకెక్కాడు. ఇక అక్కడి నుంచి పంకజ్ మళ్లీ వెన క్కుచూసుకోలేదు. తన అద్భుత ఆటతీరును కొనసా గిస్తు ప్రపంచ బిలియర్డ్, స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత త్రివర్ణ పతకాన్ని రెపరెప లాడిస్తున్నాడు. పంకజ్ అద్భుత ప్రదర్శనతోనే 2014 లో వరల్డ్ టీమ్ బిలియర్డ్ ఛాంపియన్‌షిప్‌ను భారత్ తొలిసారి సొంతం చేసుకుంది.
ఖేల్త్న్రతో సత్కారం
అంతర్జాతీయ స్థాయిలో పంకజ్ ప్రదర్శనను గుర్తించి న భారత ప్రభుత్వం అతన్ని పలు అవార్డులతో సన్మా నించింది. 2004లో అర్జున అవార్డును ప్రధానం చేసి న భారత ప్రభుత్వం 2005-06లో రాజీవ్ ఖేల్ రత్న, 2009లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.
పంకజ్ సృష్టించిన రికార్డులు
ఏళ్లకే జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్, ప్రపంచ స్నూకర్ టైటిల్ నెగ్గిన భారత క్యూయిస్ట్.
అంతర్జాతీయ టోర్నీలోనే(ఆసియన్ బిలియ ర్డ్ ఛాంపియన్షిప్-2002లో) రన్నరప్‌గా నిలిచిన తొలి భారతీయుడు.
ప్రపంచ బిలియర్డ్, స్నూకర్ టైటిళ్లు సొంతం చేసుకున్న ఏకైక భారతీయుడు.
లాంగ్ అండ్ షార్ట్ ఫార్మాట్లలో ప్రొఫెషనల్ వరల్డ్ టైటిల్(15-రెడ్, 6-రెడ్) నెగ్గి ఏకైక క్యూయిస్ట్.
ఒకే సీజన్లో ఐదు జాతీయ, ఆసియా, ప్రపంచ బిలియర్డ్ టైటిల్ నెగ్గి తొలి క్యూయిస్ట్.