Home తాజా వార్తలు ప్రభుత్వ చీఫ్ విప్‌గా గోంగిడి సునిత మహేందర్‌రెడ్డి ఖరారు

ప్రభుత్వ చీఫ్ విప్‌గా గోంగిడి సునిత మహేందర్‌రెడ్డి ఖరారు

Chief Whip of Government

 

యాదాద్రి భువనగిరి : ఈనెల 9నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. 2014లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా మొదటిసారి నియామకం కాగా ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్‌గా ప్రకటించడంతో రెండో సారి ప్రభుత్వ చీఫ్ విప్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

జననం, స్వస్థలం:
సునీత 1969, ఆగస్టు 16న నరసింహాయ్య యాదవ్, సరళ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో జన్మించారు. ఆమె బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ వరకు చదువుకున్నారు.

రాజకీయ ప్రస్థానం :
2001, జూన్ 4న రాజకీయాలలోకి ప్రవేశించి, యాదగిరిగుట్ట ఎం.పి.టి.సిగా ఎన్నికయ్యారు. అటు తర్వాత యాదగిరిగుట్ట ఎం.పి.పిగా అందరి మన్ననలను పొందారు. 2006 నుండి 2011వరకు వంగపల్లికి సర్పంచ్‌గా పనిచేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడిద భిక్షమయ్య గౌడపై 34వేల ఓట్ల మెజారిటితో ఘన విజయం సాధించారు. అటుతరువాత 2018లో అదే నియోజకవర్గం నుండి తిరుగులేని మెజార్టీనతో గెలుపొందారు.

Gongdi Sunita as Chief Whip of Government