Home తాజా వార్తలు మూడ్స్‌ను నియంత్రిద్దాం..!

మూడ్స్‌ను నియంత్రిద్దాం..!

Good food ingredients

 

ఒక చిన్న చిరునవ్వు మన చుట్టూ నవ్వుల వర్షం కురిపిస్తుంది. ఒక మంచి మాట అద్భుతమైన స్నేహ సంబంధాలను దగ్గర చేస్తుంది. మనం కొంచెం దేన్నయినా ఇవ్వగలిగితే చుట్టూ వంద చేతులు మన కోసం ఏమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ ఇన్ని మంచి పనులు చేసేందుకు కొన్నిసార్లు మూడ్ సహకరించకుండా విసిగిస్తుంది. ఎన్నో కారణాలతో, వర్క్ టెన్షన్లతో అలసటతో స్తబ్దుగా అయిపోతూ ఉంటాము. మరెలా ఇందులోంచి బయట పడటం? ఉత్సాహం తెచ్చుకోవడం ఎలా? 

మంచి ఆహార పదార్థాలు మూడ్స్‌ని నియంత్రిస్తాయని చెబుతున్నారు నిపుణులు. స్తబ్దుగా ఉన్నట్లు అనిపిస్తే కాస్త చక్కెర మూడ్‌ని సరిచేయగలుగుతుంది. రక్తంలో చక్కెర శాతం పెరిగి ఉత్సాహం వస్తుంది. అయితే ఇది తాత్కాలికం. శరీరం మనసు ఉత్తేజం పుంజుకునేందుకు అవసరమైన ఆహారం తీసుకునేలోపు చాక్లెట్ తీసుకోవచ్చు. మానసిక వత్తిడికి గురికావడం ఇవాల్టి వేగంతో కూడిన జీవన విధానంలో సర్వసాధారణం. అందుకే బాగా వత్తిడిగా అనిపిస్తే మూడ్ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం కోసం బేగ్‌లో ఒక డార్క్ చాక్లెట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. పంచదార హాని చేస్తుంది. కానీ డార్క్ చాక్లెట్ వల్ల వత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గిపోయి శరీరం మనసు ఉత్తేజం పొందుతాయి.
ఒక్కోసారి ఆఫీస్ పని ఇంటికి కూడా మనతోపాటు వచ్చేస్తూ ఉంటుంది. తీరిక లేని శ్రమ చిరాకు పెడుతూ ఉంటుంది. ఒక కప్పు గ్రీన్ టీ తో మనసు కుదుట పడుతుంది. గ్రీన్‌టీలో ఉండే థియామిన్ మనసుని శాంతపరిచి కేంద్రీకరణకు దోహదం చేస్తుంది. గ్రీన్‌టీలో కెఫీన్ చాలా తక్కువ కనుక శరీరానికి కలిగే హాని కూడా ఏమీ ఉండదు. మానసిక ఉపశమనానికి ఇవన్నీ ఉపయోగపడితే దీర్ఘకాల సంతోషానికి విటమిన్ డి ఎంతైనా ఉపయోగం. మానసిక ఉల్లాసాన్ని కలిగించే సెరోటిక్ హార్మోన్ ప్రశాంతతను , ఆనందాన్ని కలిగిస్తుంది.
తక్కువ ఫ్యాట్ ఉన్న పాలలో ఓట్స్ కలుపుకొని తినాలి. స్ట్రాబెర్రీస్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాయధాన్యాల్లో లభించే విటమిన్ డి మనోవ్యాకులతను తగ్గిస్తుంది. ఉడికించిన సాల్మన్, లేదా సార్టిక్ చేపలు, ముడి గోధుమ బ్రెడ్ తినడం వల్ల కూడా మనసు వేగంగా ఉత్తేజం చెందుతుంది.
మనసు మొద్దు బారినట్లు ,నీరసంతో కళ్లు మూతలు పడుతూ ఉంటే ఒక కప్పు కాఫీ, ఆకుపచ్చని ఆకుకూరల సలాడ్, ఆకుకూరల శాండ్ విచ్ తీసుకున్నట్లయితే మూడ్ సరై, మనకు ఉత్సాహంగా ఉంటుంది. బంగాళా దుంపలు , బాఠాణీ, పుట్టగొడుగులు కూడా శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఉత్సాహం నిండేలా చేస్తాయి. క్రీమ్, పాస్తా, కేండీబార్ తిన్నవెంటనే మూడ్ మెరుగవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం పాటిస్తారు. అధిక కార్బోహైడ్రేట్‌లుండే తియ్యని పదార్థాలతో మనసు వెంటనే ఉత్సాహం తెచ్చుకుంటుంది. మంచి ఆహార ప్రణాళికతో మూడ్స్‌ను మన కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

Good food ingredients controls moods