Home తాజా వార్తలు కీర్తి సురేష్ మహానటి

కీర్తి సురేష్ మహానటి

Good luck sakhi movie to be released on friday

 

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్ రొమ్-కామ్‌గా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని తెలుగు, తమిళం, మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ’వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్’ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్‌చరణ్ మాట్లాడుతూ “ఈ చిత్రం చాలా మీనింగ్‌ఫుల్ సినిమా అని నాకు అనిపిస్తుంది.

ఇక సినిమా పరిశ్రమలో ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేదు. ఇప్పుడు ఏ బోర్డర్ లేకుండా ఇండియన్ సినిమా అని రాజమౌళి వల్ల పేరు వచ్చింది. ఇండియన్ సినిమాలో ఆడ, మగ కలిసి పనిచేస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు నగేష్ కుకునూర్ మాట్లాడుతూ “ఈ సినిమా నేను చేయడానికి కారణం కీర్తి సురేష్. ఆమె తన పాత్రను బాగా పోషించింది. ఓ పల్లెటూరిలోని బంజారా అమ్మాయి ఎలా షూటర్‌గా ఎదిగింది? అనేదే ఈ సినిమా”అని తెలిపారు. దిల్‌రాజు మాట్లాడుతూ “కీర్తి గురించి చెప్పాలంటే ఆమె మహానటి. జగపతిబాబు, ఆది పినిశెట్టి మంచి టీమ్. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది”అని చెప్పారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ “ఫన్ సినిమా చేయాలనిపించి ‘గుడ్ లక్ సఖీ’ చేశా. ఈ సినిమాలో నా లుక్ నేచురల్‌గా ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్, సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్య వర్మ, బుజ్జి బాబు పాల్గొన్నారు.

Good luck sakhi movie to be released on friday