Thursday, April 18, 2024

బార్లు, క్లబ్‌లూ ఓపెన్

- Advertisement -
- Advertisement -

Good news for liquor lovers in Telangana

 

వైన్‌షాపుల్లో పర్మిట్ రూంలపై నిషేధం కొనసాగింపు
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే డ్యాన్సులు, మ్యూజిక్ ఇవెంట్లు, వైన్‌షాపుల్లో పర్మిట్ రూంలపై మాత్రం నిషేధం కొనసాగించింది. కొవిడ్ 19 నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని బార్లు, క్లబ్బులకు స్పష్టం చేసింది. తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, క్యూ పాటించాలని తెలిపింది. శానిటైజ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. అదే సమయంలో పార్కింగ్ స్థలాల్లో అధికంగా జనాలు గుమికూడకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే బార్ల నిర్వహకులు, సర్వ్ చేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపింది. బార్లలో వెంటిలేషన్ ఉండాలని, ప్రతిరోజూ శానిటైజ్ చేస్తూనే, ఒక వినియోగదారుడు వెళ్లిన తరువాత వెంటనే ఆ సీటును కూడా శానిటైజ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రారంభం నుంచి బార్లు, క్లబ్బులు మూతపడే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్ 2 మార్గదర్శకాలకు అనుగుణంగా వైన్ షాపులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే కరోనా తీవ్రత దృష్టా బార్లకు అనుమతి నిరాకరించింది. ఆన్‌లాక్‌లో భాగంగా ఇటీవల కాలంలో అన్ని కార్యాకలపాల పునరుద్ధరణకు ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే జిహెచ్‌ఎంసి పరిధిలో 25 శాతం బస్సులు తిరుగుతున్నాయి. బార్లు, క్లబ్బుల యాజమానులు కూడా ఎక్సైజ్ శాఖకు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అసలే ఐపిఎల్ టైం కావడంతో కరోనా ఉన్నప్పటికీ బార్లకు తాకిడి ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారు ఒకరు తెలిపారు.

Good news for liquor lovers in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News