Saturday, April 20, 2024

ఎస్‌బిఐ వినియోగదారులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

SBI

న్యూ ఢిల్లీ: ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్రవ్య విధాన ప్రకటన ప్రకటించిన మరుసటి రోజు తర్వాత దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ రుణ రేట్లను తగ్గించింది. ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గృహ, ఆటో రుణాలను చౌకగా చేసింది. ఎస్‌బిఐ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను కూడా తగ్గించింది. కొత్త రేట్లు 2020 ఫిబ్రవరి 10 నుండి అమలులోకి వస్తాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వరుసగా తొమ్మిదోసారి మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్‌ఆర్) లో తగ్గింపును ఎస్‌బిఐ ప్రకటించింది.

ఎస్‌బిఐ ఎంసిఎల్‌ఆర్‌ను తగ్గించింది. ఇది ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గురువారం జరిగిన చివరి ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటును అంటే 5.15 శాతం రెపో రేటును కొనసాగించాలని నిర్ణయించింది. అయినప్పటికీ సెంట్రల్ బ్యాంక్ గృహ, వాహన రుణాల కోసం బ్యాంకులకు సిఆర్‌ఆర్ ఉపశమనాన్ని ప్రకటించింది. తద్వారా వినియోగదారులకు తక్కువ రేటుకే ఆటో, గృహ రుణాలు లభిస్తాయి.

Good news for SBI customers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News