Home మహబూబ్‌నగర్ పాలమూరు నిరుద్యోగులకు తీపి కబురు

పాలమూరు నిరుద్యోగులకు తీపి కబురు

ts-govt-logo.jpg1

     

                                                

మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి దీపావళికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు చల్లని కబురు వినిపించడానికి ప్రభుత్వం నడుంబిగించింది. ఈ నియామకాలకు సంబంధించి టిఎస్‌పిఎస్‌సి అధికారులు సమీక్ష నిర్వహించారు. వీటి నియామకాలను పాతపద్ధతిలోనే పరీక్షలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పేపరుకు 80 మార్కులు, 160 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు అరమార్క (1/2) ఉండే విధంగా పరీక్ష నిర్వహించనున్నారు. టెట్ మార్కుల 20 శాతం వెయిటేజి ఇవ్వనున్నారు. పాత మహబూబ్‌నగర్ నుంచి విడిపోయి కొత్తగా 26 మండలాలతో ఏర్పాటు అయిన మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్న 714 ఖాళీలకు సంబంధించి ఈ పరీక్ష ఏర్పాటు చేయనున్నారు.

కొత్త జిల్లాల ప్రకారమే ఖాళీగా ఉన్న 714 పోస్టులకు నియామకాలు ఉండనున్నాయి. ఇటీవల సిఎం కెసియర్ ప్రకటన మేరకు ఈ నియామకాలను చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 26 మండలాల పరిధిలో 1358 పాఠశాలలు ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోపు భర్తీ కానున్నాయి.

పాలమూరు జిల్లాలో ఖాళీలు

జిల్లాలో 26 మండల పరిధిలో మొత్తం 714 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఇందులో 550 సెకెండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జిటి), 120 స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఎ), 40 లాంగ్వేజ్ పండిత్ (ఎల్‌పి), 4 పిఇటి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని దీనికి సంబంధించి వివరాలను టిఎస్‌పిఎస్‌సికి పంపినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.