Home తాజా వార్తలు బిజీ బిజీగా కృతి శెట్టి

బిజీ బిజీగా కృతి శెట్టి

Good opportunities for Kriti Shetty in Tollywood

 

ప్రేమకథల ద్వారా చాలామంది కథానాయికలు పరిచయమయ్యారు .. వెళ్లారు. కానీ ‘ఉప్పెన’ సినిమాలోని కృతిశెట్టి లాంటి యంగ్ బ్యూటీని మాత్రం తాము చూడలేదనే మాట చాలామంది యువకులు అంటున్నారు. సొట్టబుగ్గలతో కూడిన నవ్వులతో ఈ పిల్ల గారడీ చేస్తోందనీ .. గుండెలన్నీ గల్లంతు చేస్తోందని కుర్రకారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కృతిశెట్టికి టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ అమ్మాయిని తమ సినిమాల్లో కథానాయికగా తీసుకోవడానికి దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ అమ్మాయి నాని, సుధీర్ బాబు, రామ్ సినిమాల్లో నటిస్తోంది. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే థియేటర్లకు రానున్నాయి. ‘ఉప్పెన’ సినిమా వేదికపై చిరంజీవి చెప్పినట్టు ప్రస్తుతం ఈ అమ్మాయి డేట్లు దొరికే పరిస్థితి లేదు. అయినా యువ హీరోలు తమ ప్రయత్నాలు ఆప డం లేదని తెలిసింది. ’అంధాదూన్’ సినిమా తరువాత వక్కం తం వంశీ దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం కృతి శెట్టిని సంప్రదిస్తున్నట్టుగా టాక్. ఇక నిఖిల్, నాగశౌర్య, చైతూ .. తదుపరి సినిమాలలో హీరోయిన్‌గా కూడా ఈ అమ్మాయినే అడుగుతున్నారట.