Home తాజా వార్తలు దూసుకుపోతున్న ‘డిస్కో రాజా’…

దూసుకుపోతున్న ‘డిస్కో రాజా’…

Disco-Rajaరవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో రవితేజ, వెన్నెల కిషోర్‌ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆతర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. అదేవిధంగా పాతబస్తీలో రవితేజ, ఇతర నటీనటుల మధ్య ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. బాబీ సింహా, సత్య, సునీల్, రాంకీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః కార్తిక్ ఘట్టమనేని, మ్యూజిక్‌ః తమన్, డైలాగ్స్‌ః అబ్బూరి రవి, ఎడిటర్‌ః నవీన్ నూలి.

Good response to the Disco Raja First Look