Friday, July 18, 2025

పట్టాలు తప్పిన గూడ్స్

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం పెద్ద ప్రమాదం తప్పింది. మహబూబ్ నగర్ మన్యం కొండ స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సాయంత్రం 7 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో అనేక ప్రధాన రైళ్ల రాక పోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పట్టాలు తప్పిన భోగి కారణంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ డివిటిపల్లి వద్ద, హంద్రీ ఎక్స్‌ప్రెస్ , బెంగళూరు ఎక్స్ ప్రెస్ జడ్చర్ల వద్ద, ప్యాసింజర్ రైలు గొల్లపల్లి వద్ద, గుంటూరు-ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ దేవరకద్ర వద్ద, రైచూరు..కాచిగూడ ఎక్స్‌ప్రెస్ కౌకుంట్ల వద్ద, వందే భారత్ రైలు వనపర్తి వద్ద నిలిచిపోయాయి. అంతేకాక, అనేక ఇతర రైళ్లు కూడా ఆయా స్టేషన్లలో నిలిచిపోయినట్లు సమాచారం. రైళ్ల నిలిచి పోవ డంతో ప్రయాణికులు గంటల తరబడి స్టేషన్లలో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. పట్టాలు తప్పిన భోగిని తొల గించే పనులు చేపట్టారు. రాకపోకలు పూర్తిగా పునరుద్ధరించేందుకు అనువైన చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News