Friday, April 19, 2024

‘గూగుల్’కు నేడు 23 ఏళ్లు!

- Advertisement -
- Advertisement -

Google at 23

కాలిఫోర్నియా: ‘గూగుల్’కు నేడు 23 ఏళ్లు!ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్ తదితర సేవలతో గూగుల్ రోజురోజుకు పురోగతి సాధిస్తోంది. అమెరికాకు చెందిన గూగుల్ సంస్థ సోమవారం 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగూల్ తన హోంపేజీలో కేక్ డూడుల్‌ను ఉంచింది. 23వ వార్షికోత్సవాన్ని సూచించేవిధంగా కేకుపై 23 అని కూడా ఉంచింది.
గూగుల్ సంస్థను అమెరికాకు చెందిన లారీ పేజ్, సర్జీ బ్రిన్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్నప్పుడు, 1998 సెప్టెంబర్ 4న స్థాపించారు. 150కి పైగా వివిధ భాషల్లో సెర్చ్ చేసే అవకాశాన్ని గూగుల్ నెటిజన్లకు అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు సిఇఒగా భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News