Friday, April 19, 2024

డేటాను దొంగిలించే మాల్వేర్‌ను బ్లాక్ చేసిన గూగుల్!

- Advertisement -
- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో: సైబర్ దాడి నుంచి రక్షించే ప్రయత్నంలో భాగంగా గూగుల్ ప్రసిద్ధ ‘క్రిప్ట్‌బాట్ ’ మాల్వేర్‌ను బ్లాక్ చేసింది. అది లక్షలాది క్రోమ్ బ్రౌజర్ వినియోగదారుల డేటాని గత ఏడాది దొంగిలించింది. ‘క్రిప్ట్‌బాట్ ’ అనేది ఓ రకమైన మాల్వేర్. దానిని ‘ఇన్ఫోస్టీలర్’ అని కూడా అంటుంటారు. ఎందుకంటే అది బాధితుల సున్నిత సమాచారాన్ని కంప్యూటర్ నుంచి దొంగిలిస్తుంటుంది. అంటే అథెంటికేషన్ క్రెడెన్షియల్స్, సోషల్ మీడియా అకౌంట్ లాగిన్స్, క్రిప్టోకరెన్సీ వాలెట్స్, తదితరాలను.

క్రిప్ట్‌బాట్ తర్వాత తాను దొంగిలించిన డేటాను చెడ్డవారికి అమ్ముతుంది. వారు దానిని డేటా బ్రీచ్ క్యాంపెయిన్స్‌కు ఉపయోగిస్తుంటారు. గూగుల్ క్రోమ్, గూగుల్ ఎర్త్ ప్రో వంటి మాలియస్లీ మాడిఫైడ్ యాప్స్ ద్వారా అది మాల్‌వేర్‌ను వ్యాపింపజేస్తుందని గూగుల్ తెలిపింది. గత ఏడాది గూగుల్ క్రోమ్‌ను టార్గెట్ చేసి దాదాపు 670000 కంప్యూటర్లను ఇన్‌ఫెక్ట్ చేసిందీ మాల్వేర్. డేటాను కూడా దొంగిలించింది. ‘క్రిప్ట్‌బాట్ ప్రధాన డిస్ట్రిబ్యూటర్ పాకిస్థాన్‌కు చెందిన వ్యకి అని తెలిసింది. అమెరికాలోని న్యూయార్క్ దక్షిణ జిల్లా ఫెడరల్ జడ్జీ గూగుల్‌ను ఆదేశిస్తూ తగు చర్యలు చేపట్టాలని తీర్పు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News