న్యూఢిల్లీ : భారతీ ఎయిర్‌టెల్‌లో 1 బిలియన్ డాలర్లు (రూ.7,507 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్, వివిధ పరికరాల్లో వాణిజ్య భాగస్వామ్యంతో కూడిన ఒప్పందం కుదుర్చుకున్నట్టు శుక్రవారం కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో రెండో టెక్ కంపెనీలో గూగుల్ ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటికే గూగుల్ రిలయన్స్ జియోలో గూగుల్ 7.73 శాతం వాటాను తీసుకుంది. స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్ కోసం ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పుడు ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్‌లో సంస్థ వృద్ధిపై గూగుల్ దృష్టి కేంద్రీకరించింది. ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో ఎయిర్‌టెల్‌కు చెందిన 700 మిలియన్ డాలర్లు (రూ.5,224 కోట్ల) విలువచేసే వాటాలు ఉన్నాయి. షేరుకు రూ.734 చొప్పున గూగుల్‌కు ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం వాటాను ఇవ్వనున్నారు. అదనంగా 300 మిలియన్ డాలర్లు వివిధ విభాగాల్లో గూగుల్ ఇన్వెస్ట్ చేయనుంది.
Google has invested Rs 7500 cr in airtel