Home తాజా వార్తలు శేఖర్ మాస్టర్‌ను చంపేసిన గూగుల్

శేఖర్ మాస్టర్‌ను చంపేసిన గూగుల్

Google killed choreographer Sekhar master

హైదరాబాద్: గూగుల్ సెర్చ్ ఇంజన్ తప్పుడు సమాచారం అప్‌లోడ్ చేసి నవ్వుల పాలు అవుతోంది. భారత్ దేశంలో అత్యంత చెత్త భాష ఏంటని టైప్ చేస్తే కన్నడం రావడంతో కర్నాటక ప్రజలు మండిపడ్డారు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విషయంలో గూగుల్ పెద్ద తప్పు చేసింది. గూగుల్‌లో శేఖర్ మాస్టర్ గురించి సెర్చ్ చేయగా ఆయన 1963లో జన్మించారని, 2003లో కన్నుమూశారని చూపిస్తోంది. గూగుల్ శేఖర్ మాస్టర్‌ని చంపేసిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ కు చెందిన ఆర్టిస్ట్ జివి శేఖర్ యాబై సినిమాల్లో నటించారు. ఆయన 2003 జూలై 8వ తేదీన చనిపోయారు. ఆయన ఫోటోకు బదులుగా శేఖర్ మాస్టర్‌ను ఫోటోను అప్‌లోడ్ చేయడంతో తప్పిదం జరిగింది. గూగుల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లో నంబర్ వన్ డ్యాన్ మాస్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.