Thursday, April 25, 2024

గంటసేపు నిలిచిపోయిన గూగుల్ సర్వీసులు

- Advertisement -
- Advertisement -

Google services stopped for an hour

 

ఇబ్బందిపడ్డ 150 కోట్లమంది

న్యూఢిల్లీ: గూగుల్‌కు చెందిన ప్రధాన సర్వీసులన్నీ సోమవారం సాయంత్రం దాదాపు గంటసేపు నిలిచిపోయాయి. జి మెయిల్, యు ట్యూబ్, డాక్స్, గూగుల్ డ్రైవ్, గూగుల్ మ్యాప్స్, స్లైడ్స్, హ్యాంగ్ అవుట్స్ అన్నీ నిలిచిపోయాయి. ఐదు గంటల తర్వాత సర్వీసులు ఒక్కొక్కటిగా నిలిచిపోయాయి. గూగుల్ సర్వీసులు నిలిచిపోవడంతో ట్విట్టర్‌కు ట్విట్ల తాకిడి ఎక్కువైంది. ట్విట్టర్ ద్వారా గూగుల్ సర్వీసుల్లో అంతరాయానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు వినియోగదారులు ప్రయత్నించారు. గూగుల్ డ్యాష్‌బోర్డు ప్రకారం జి మెయిల్‌కు సాయంత్రం 525కు సమస్య మొదలైంది. భారత్‌తోపాటు అమెరికా, యూరోపియన్ దేశాల్లోనూ గూగుల్ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో, మొత్తం 150 కోట్లమంది ఇబ్బంది పడి ఉంటారని టెక్‌వర్గాలు అంచనా వేశాయి. ఈ ఏడాది ఆగస్టులోనూ గూగుల్ సర్వీసులకు ఇలాంటి సమస్యే తలెత్తింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News