Friday, March 29, 2024

జియోలో గూగుల్ వాటా 7.7 శాతం: ముకేశ్ అంబానీ

- Advertisement -
- Advertisement -

 

Google share in Jio 7.7 percentage says mukesh ambani

ముంబయి: రిలయన్స్ జియో వ్యూహాత్మక భాగస్వామిగా గూగుల్ చేరిందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ మాట్లాడారు. వాటాదారులను అందరికి పరిచయం చేశాడు. జియో సంస్థలోకి గూగుల్ రూ.33733 కోట్ల పెట్టుబడి పెట్టనుందని వెల్లడించారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.7 శాతం వాటాను గూగుల్ తీసుకుందన్నాడు. రిలయన్స్ జియోలోకి రూ.2.12 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చాయన్నారు. పెట్టుబడుల సమీకరణ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నామని, జియో రిటైల్ ఆయిల్ విభాగాల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. డిజిటల్ విప్లవాన్ని జియో ముందుకు తీసుకెళ్తోందన్నారు. స్పెక్ట్రమ్ కేటాయింపులు రాగానే జియో 5 జి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జియో-5జి సేవలతో ఆధునిక ప్రపంచ దశ,దిశ మారనుందన్నారు. రవాణా, వ్యవసాయం, వైద్యం, విద్యారంగాల్లో జియో-5జితో నూతన శకం ప్రారంభమైందన్నారు. జియో మార్ట్‌తో కిరాణా దుకాణాలకు ఆధునిక సాంకేతిక సొబగులుంటాయని, జియో మార్ట్‌తో 48 గంటల్లోనే సాధారణ కిరాణా దుకాణాలకు కొత్త రూపు వస్తాయని, వినియోగదారుల వంద శాతం అవసరాలు తీర్చేలా జియో మార్ట్ కిరాణా దుకాణాలుంటాయన్నారు. జియో మార్ట్ ద్వారా నమ్మకమైన, నాణ్యమైన ఉత్పత్తులు ఉంటాయని, తొలి ఆర్డర్‌కు కరోనా కాంప్టిమెంటరీ కిట్ ఉచితంగా అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News