Friday, April 19, 2024

ముచ్చటగా మూడోసారి.. గోపీచంద్ 30వ సినిమా ప్రకటన

- Advertisement -
- Advertisement -

Gopichand's 30th movie announced

మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. గోపీచంద్ 30వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబందించిన పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. గతంలో గోపీచంద్, శ్రీవాస్ కాంబోలో వచ్చిన ‘ల‌క్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో తాజా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సీనియ‌ర్ రచయిత భూప‌తి రాజా క‌థ‌ను అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టీజి విశ్వ ప్ర‌సాద్, వివేక్ కూచిబొట్ల కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు.

Gopichand’s 30th movie announced

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News