Home అంతర్జాతీయ వార్తలు గొరిల్లాస్ గ్లోరియస్ సెల్ఫీ…

గొరిల్లాస్ గ్లోరియస్ సెల్ఫీ…

Selfie With Gorilla ప్రస్తుతం మనుషుల ట్రెండ్ మారింది. సరదగా ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఏం చేస్తున్నాం సెల్ఫీలు దిగి, వాట్సాప్ స్టేటస్ గా అప్ డేట్ చేస్తున్నాం, లేదా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నాం… అది మానవులకు అలవాటుగా మారింది. ఫోటోలకు కేవలం మనుషులు మాత్రమే పోజులు ఇస్తున్నారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇటీవల ఓ పార్కులో గొరిల్లాలు సెల్ఫీలకు ఫోజులిచ్చాయి.

కాంగోలోని విరుంగ నేషనల్ పార్కులో మొంటెన్ గొరిల్లాలను సంరక్షిస్తున్నారు. అక్కడ పనిచేసే మథి శ్యామపు అనే రేంజర్ సరదగా రెెండు గొరిల్లాలతో సెల్ఫీ దిగాడు. అనంతరం తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అంతే గంటల వ్యవధిలోనే ఆ సెల్ఫీ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అతను చేసిన పోస్ట్‌ను 20వేలకు పైగా నెటిజన్లు షేర్ చేయడంతో పాటు విపరీతంగా లైకులు వచ్చి పడ్డాయి. మథి సెల్ఫీ తీస్తుండగా గొరిల్లాలు ఫోజులివ్వడం ఈ ఫోటోలో హైలెట్ గా నిలిచింది. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు.  ‘సెల్ఫీ ఆఫ్ ద ఇయర్’ అనే కామెంట్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంది.

Gorilla Selfie with Ranger