Home Default హస్తినకు గూర్ఖాల ఉద్యమం

హస్తినకు గూర్ఖాల ఉద్యమం

Gorkhaland

న్యూఢిల్లీ/డార్జిలింగ్: గూర్ఖాలాండ్ ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతూ ఢిల్లీకి చేరింది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, అదే విధం గా పశ్చిమ బెంగాల్‌లో తక్షణం రాష్ట్రపతి పాలన విధించా లంటూ గూర్ఖాలాండ్ మద్దతుదారులు ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో 110 మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహిం చారు. వెంటనే పారామిలిటరీ దళాలను వెనక్కి పంపడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని గూర్ఖా సంయుక్త సంఘర్ష సమితి (జిఎస్‌ఎస్ ఎస్)కి చెందిన ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఉగ్రవాదుల వలే చూస్తూ వారిని పొట్ట న పెట్టుకుంటో ందని జిఎస్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు కిరణ్ బికె మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పారా మిలిటరీ దళాల ను ఉపసంహరించు కోవ డంతో పాటు డిజిపిని విధుల నుంచి తొల గించా లన్నారు. కాగా, 110 ఏళ్లుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నామని తెలియజేసే జెండాతో రాజ్‌ఘాట్ నుంచి జంతర్‌మంతర్ వరకు ఆందో ళనకారులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జంతర్ మంతర్‌కు చేరుకో గానే ఇప్పటికే మూడు వారాలుగా ఆందోళన చేస్తున్న మద్దతుదారు లు వారితో కలిశారు. కొంత మంది ఆందోళనకా రులు బిజెపిని విమర్శిస్తూ ప్లకార్డులను ప్రదర్శిం చారు. బెంగాలీలకు గుర్తింపు ఉన్నట్లుగానే తమకు కూడా ఒక గుర్తింపు కావాలని పోరాటం చేస్తున్నామని ఆందోళనలో పాల్గొన్న డార్జీలిం గ్‌కు చెందిన స్టుటి థామి తెలిపారు. ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించా లని, తాము చావడానికై నా సిద్ధమేనని, కానీ పశ్చిమ బెంగాల్ ప్రభు త్వంతో కలిసి ఉండేది లేదన్నారు. ఇదిలా ఉండ గా, డార్జీలింగ్‌లో మద్ద తుదారులపై పోలీసులు కాల్పులు జరుపుతూ వారి మృతికి కారణం కావ డాన్ని నిరసిస్తూ ర్యాలీలు నిర్వహించాలని గూ ర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం) ప్రణాళికను సి ద్ధం చేసింది. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం డార్జీలింగ్‌లో నిరవధి కంగా నిర్వహిస్తున్న బంద్ ఆదివారం 25వ రోజుకు చేరింది.
కాల్పులకు వ్యతిరేకంగా జిజెఎం నిరసన
పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో గూర్ఖా జన ముక్తి మోర్చా (జిజెఎమ్) నిరసన, ర్యాలీలతో మ ళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక గూ ర్ఖాలాండ్ రాష్ట్రం కోసం కొనసాగతున్న నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం భారీసంఖ్యలో నిరసనకారులు పోక్రి బాంగ్ వద్ద బిడిఒ కార్యాలయంపై దాడిచేశారు. పోలీసులు కాల్పుల్లో మృతిచెందిన తషి భూటి యా, సురాజ్ సుందాస్‌ల మృతదేహాలతో చౌక్‌బ జార్‌లో ర్యాలీలు చేపట్టారు. అనంతరం భద్రతా సిబ్బందిని కొట్టి పోలీసు శిబిరానికి నిప్పంటించా రు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గా యాలయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ, పోలీసు సిబ్బంది డార్జిలింగ్ హిల్స్‌లో హైఅలర్ట్ ప్రకటించాయి. శనివారం సోనాడ పోలీసు స్టేష న్‌పై దాడి చేసి పోలీస్ బూత్‌ను కూడా తగలబె ట్టారు. పోలీసుల అవుట్‌పోస్టుకు కూడా నిప్పుపె ట్టారు. జిఎన్‌ఎల్‌ఎఫ్ కూడా సోనాడ పోలీస్ స్టేష న్ వరకు తషి భూటయా మృతదేహాన్ని ఊరేగి స్తూ నిరసన తెలిపింది. పోలీసులకు, నిరసనకా రులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు వ్య క్తులు మృతిచెందారని జిజెఎమ్ ఆరోపించింది. వారి మృతికి నిరసనగా ఆదివారం డార్జిలింగ్‌లో భారీగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేపట్టింది.