Home జాతీయ వార్తలు రగులుతున్న డార్జిలింగ్

రగులుతున్న డార్జిలింగ్

హింసారూపం దాల్చుతున్న ప్రత్యేక ఉద్యమం

                         Movement

డార్జిలింగ్:  ప్రత్యేక గూర్ఖాలాండ్ కావాలన్న ఆందోళన డార్జిలింగ్‌లో గురువారం మరింత తీవ్రరూపం దాల్చిం ది. అల్లర్లను అణచివేసే పోలీసులు, ఆందోళనకా రులు ఒకరిపైమరొకరు రాళ్లు రువ్వుకున్నారు.  గూర్ఖాలాండ్ ఉద్యమం ఇప్పుడు  పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ సంక్షోభం కానున్నది. పైగా డార్జి లింగ్ పర్యాటక రంగానికి దెబ్బ కానున్నది. ‘ప్రస్తు త పరిస్థితిని సృష్టించింది రాష్ట్రప్రభుత్వమే. వారు పోలీ సు బలగాన్ని ఉపయోగించి మమ్మల్ని అణచేయాలని చూస్తు న్నారు’ అంటూ జిజెఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి విలేకరులకు చెప్పారు. ఈ ‘రాజకీయ సమ స్య’ను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పరిష్కరించాలని అన్నారు.

దీనికి ముందు గోర్ఖా జనముక్తి మోర్చా అధి నేత బిమల్ గురుం గ్ ఇళ్ల ఆవరణల నుంచి పోలీ సులు  300కుపైగా ఆయు ధాలను స్వాధీనం చేసుకు న్నారు. అయితే గురుంగ్ ఇంటిపై తాము దాడులు నిర్వహించ లేదని పోలీసులు చె ప్పారు. గూర్ఖాలాండ్ ఉద్యమ కారులు నిరవధిక బంద్‌ను నిర్వహిస్తున్నారు. డార్జిలిం గ్‌లోని సింగ్మరి, పట్లేబస్ ప్రాం తాలలో పోలీసులు దాడులు చేసి కొందరు జిజెఎం కార్య కర్తలను అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్‌లో డార్జిలింగ్ తేయాకు తోటలున్న ప్రాంతం, ఇది భారత దేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కూడా.

ఇదిలా ఉండగా ‘పోలీ సులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఏమిటి?… మా(గూర్ఖాల) సాంప్రదాయిక ఖుక్రీ, విళ్లు, బాణాలే కదా? వాటివల్ల కలిగే హానీ ఏమిటి? అవన్నీ విలువిద్య పోటీలో విద్యార్థులు ఉపయోగించేందుకు ఉద్దేశించిన వే!’ అని జిజెఎం ప్రధాన కార్యదర్శి గిరి అన్నారు. ‘మేము విషయాన్ని కేంద్రానికి తెలిపి జోక్యం చేసుకో మని కోరతాం. పోలీసుల దాష్టికాన్ని వివరిస్తాం’ అని చెప్పుకొచ్చారు. గిరి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా రు. డార్జి లింగ్‌లో గోర్ఖాల సంఖ్య మెజారిటీగా ఉంది. వారు ప్రత్యే క గూర్ఖాలాండ్‌ను కోరుకుంటున్నారు. తమపై బెంగాలీ భాషను రుద్దడాన్ని కూడా వ్యతిరేకిస్తు న్నారు. ఇదిలా  ఉండగా అక్కడ సాధారణ పరిస్థితిని నెలకొల్ప డానికి కేంద్రం 600 పారామిలిటరీ బలగాన్ని పంపిం ది. వారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సహక రించ నున్నారు. ప్రస్తుతం డార్జిలింగ్ ప్రాంతంలో రాళ్లు రువ్వే సంఘటన లతో చాలా అశాంతిగా ఉంది. దీనిపై పూర్తి వివరాలతో నివేదిక పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అక్కడి  రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.