Thursday, December 1, 2022

లంక నూతన అధ్యక్షుడిగా గొటబాయా రాజపక్స..!

- Advertisement -

 

కొలంబో: శ్రీలంకలో కొత్త అధ్యక్షుడి కోసం జరుగుతున్న ఎన్నికల్లో మాజీ మిలటరీ అధికారి గొటబాయా రాజపక్స(మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స సోదరుడు) విజయం దాదాపు ఖరారైంది. దేశవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం వరకు వెల్లడైన ఫలితాల్లో గొటబయా గెలుపొందినట్లు తెలుస్తోంది. ఆయన విజయంపై అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పోలింగ్‌లో సుమారు 80శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగోవంతు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి అధికార యూఎన్‌పికి చెందిన సాజిత్ ప్రేమదాసకు 45.3%, రాజపక్సకు 48.2% ఓట్లతో ముందంజలో ఉన్నారని ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులు పేర్కొన్నారు.మొత్తం పోలైన ఓట్లలో తమకు 53-54% ఓట్లతో వస్తాయని ఆశిస్తున్నట్లు రాజపక్స ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అత్యంత సస్పెన్స్ మధ్య జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రం అధికారికంగా వెలువడనున్నాయి. ప్రస్తుత దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.

Gotabaya Rajapaksa Victory in Lanka Presidential Polls

Related Articles

- Advertisement -

Latest Articles