Home జగిత్యాల దేవాలయాల అభివృద్ధిపై దృష్టి : ఇంద్రకరణ్‌రెడ్డి

దేవాలయాల అభివృద్ధిపై దృష్టి : ఇంద్రకరణ్‌రెడ్డి

Indra-Karan-Reddy

ధర్మపురి:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని దేవాలయాలను విస్మరించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ముక్కోటి ఏకదశి పర్వదినాన్ని పురస్కరించుకు ని జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణలోని దేవాలయాలను నిర్వీర్యం చేసి, ఆంధ్రా ప్రాంతంలోని దేవాలయాను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రస్తుతం దేవాలయాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీ కరించిందన్నారు. అందులో భాగంగానే యాదాద్రి, కొండగట్టు, వేములవాడ, ధర్మపురి క్షేత్రాల కోసం సి ఎం కెసిఆర్ పెద్దమొత్తంలో నిధులు కేటాయించారన్నారు.

ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు ఏంతో ప్రశస్తం గల దేవుడని, రానున్న రోజుల్లో ధర్మపురి క్షేత్రం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చెందనుందన్నారు. ప్రభుత్వ సలహదారు డా. వి వేకానంద్ మాట్లాడుతూ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కరుణ కటాక్షలతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు విజయవంతం కావాలని కోరారు.  ప్రభుత్వ చీప్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీర్వాదంతో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు.