Home తాజా వార్తలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి…

Government Degree Colleges

 

నర్సంపేట: ఇంటర్ పాసైన విద్యార్థులు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి కశాలలో ఉన్నటు వంటి సౌకర్యాలు, అనుభవం కలిగిన ఉపాద్యాయులు అందించె విద్యను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి సూచించారు. గురువారం కళాశాల అధ్యాపక బృందం ఖానాపురం మండలం రాగంపేట, కొత్తూరు, గూడూరు, దామరవంచ గ్రామాల్లో పర్యటించి ఇంటర్ పాసైన విద్యార్థులకు వారి తల్లి దండ్రులకు ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి సదుపాయాలపై వివరించినట్లు తెలిపారు. డిగ్రీలో చేరే విద్యార్థులు వచ్చె నెల 3 వ తారీకు వరకు అడ్మిషన్ చివరి తేదని, దోస్తు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివనాగ శ్రీను, లకన్‌సింగ్, నరెందర్, శ్రీనివాస్, రమేశ్ లు పాల్గొన్నట్లు తెలిపారు.

Government Degree Colleges Provide Quality Education