Home తాజా వార్తలు సృజనాత్మకతకు ప్రభుత్వ ప్రోత్సాహం

సృజనాత్మకతకు ప్రభుత్వ ప్రోత్సాహం

swethamahanthi

 

వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో నూతన ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సంవత్సరం నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నూతన ఆవిష్కరణలు, సృజనాత్మకతపై ప్రత్యేకించి ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. ఇటీవల కాలంలో వివిధ రంగాల్లో పలువురు కొత్త కొత్త ఆవిష్కరణలు కనుగొంటున్నారన్నారు. అవి ప్రాచుర్యంలోకి రావడంలేదని, అలాంటి వారి ప్రతిభ మరుగున పడిపోతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు, సృజనాత్మకతను వెలుగులోకి తీసుకువచ్చిన వారికి సముచిత స్థానం కల్పించడంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కేంద్రా లతో పాటు రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇందుకు గాను తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల మండలి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రదర్శించిన ఆవిష్కరణలను రాష్ట్రస్థాయికి పంపడం జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా నిలిచిన ప్రదర్శ నలకు పేటెంట్ హక్కులను కల్పించడం , అవార్డుతో పాటు స్వతంత్రంగా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తుందన్నారు. అన్ని రంగాల్లో నూతన ఆవిష్కరణలను పంపేవారు 2 నుండి 5 నిమిషాల నిడివితో రూపొందించిన వీడియోను ఆవిష్కర్త పూర్తి వివరాలతో సెల్ మరియు వాట్సాప్ నెంబర్ 9100678543కు ఆగష్టు 5వ తేదీ లగా పంపాలన్నారు.

ఆవిష్కరణల్లో ఉత్తమ మైన వాటిని ఎంపిక చేసి జిల్లాకు పంపడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో కొత్త ఆవిష్కరణలు రూపొందించి న వారందరు అర్హులేనని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని యువత ,విద్యార్థులు , ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రైతులు, అన్ని రంగాల వారు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Government Encouragement for Creativity