Home జయశంకర్ భూపాలపల్లి అన్నదాతకు ‘యంత్ర’సాయం..

అన్నదాతకు ‘యంత్ర’సాయం..

Government Give To Farmers Cultivation Missions

మన తెలంగాణ/మహాముత్తారం : అనాదిగా కాడెద్దులు ఉన్న వాడినే రైతులుగా పరిగణించేవారు. కానీ నేడు రైతులు ఎద్దులు లేకుండానే ఎవుసం చేస్తున్నారు. తక్కువ పని ఎక్కువ సమయం కోసం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. దుక్కి దున్నేది మొదలుకుని సరుకును మార్కెట్‌కు తరలించే వరకు రైతులు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ రంగం సర్వం యాంత్రీకరణమయంగా మారింది. విత్తనం నాటేందుకు, వరినాట్లు వేసేందుకు మహిళా కూలీలు, పంటకోసం నూర్చేందుకు మగ కూ లీలు నేడు రైతులకు కొరతగా ఉండడంతో వారు యంత్రాల వినియోగం వైపు మొగ్గు చూపుతున్నారు. యంత్రాల వినియోగంలో రైతులు సమయానుకూలంగా, సకాలంలో సమర్థవంతంగా పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడింది.
గ్రామాల్లో విరివిగా యంత్రాల వాడకం..!
ఒక్కప్పుడు పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులు మాత్రమే యంత్రాలను ఉపయోగించేవారు. కానీ ప్రస్థుతం పల్లెల్లో కూడా యంత్రాలను రైతులు విరివిగా ఉపయోగిస్తున్నారు. గ్రామాల్లో రై తులు ట్రాక్టర్లతో పాటు వ్యవసాయ యంత్రాలను విరివిగా కొనుగోలు చేస్తు న్నారు. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కూడా రైతులకు పలు పథకాలను ప్రవేశపెట్టి యంత్రాలను సబ్సిడీ కింద అందచే స్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాడెడ్ల ధరలు పెరగడం, కూలీలు దొరక్క పోవడంతో రైతులు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ట్రాక్టర్లు, కల్టివేటర్ (గొర్రు), వరికోత యంత్రం, వరి కలుపు యంత్రం, పవర్ స్పేయర్, మినీ ట్రాక్టర్, పవర్ పీడర్, రోటవేటర్, డ్రమ్ సీడర్ తదితర యంత్రాల వైపు రైతన్న దృష్టి సారిస్తున్నాడు.
ట్రాక్టర్..!
నిన్న మొన్నటి వరకు రైతులు కాడెడ్లతో దుక్కులు దున్నేవారు. ఒక ఎకరం దుక్కిదున్నేందుకు ఒక నాగలి రెండు రోజుల సమయం పట్టేది. కానీ నేడు యంత్రాల సహాయంతో గంటలోనే ఎకరం దుక్కిదున్నుతున్నారు. ట్రాక్టర్లకు నాగళ్లు అమర్చి దున్నడం మామూలుగా ఉండేది. కానీ నేడు ట్రాక్టర్లకు డిస్క్‌లు అమ ర్చుతున్నారు. డిస్క్‌లు అమర్చడం వల్ల పైపొర మట్టి కిందికి, కింది పొర మట్టి పైకి వస్తుంది. దీంతో కలుపు మొక్కల విత్తనాలు లోపలికి పోయి. కలుపు రాకుండా ఉంటుంది.
కల్టివేటర్ (గొర్రు)..!
ట్రాక్టర్‌కు కల్టివేటర్‌ను ఉపయోగించడం పై పొర భూమి వరకే చదును అవుతుంది. ఎకరం భూమి గంట సమయం లోపే దున్నడం పూర్తి అవుతుంది. భూమి చదు నుగా ఏర్పడి వెంటనే విత్తనాలు వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ప్లౌ (పెద్ద నాగళ్లు)..!
ట్రాక్టర్లకు పెద్ద నాగళ్లు అమర్చి వేసవి దుక్కులు దున్నుకుంటారు. పెద్ద నాగళ్లతో దున్నడం వల్ల దుక్కులు లోతుగా ఏర్పడి కలుపు రాకపోవడంతో పాటు భూ మిలో చీడపీడలు చనిపోతాయి. ప్లౌతో చాలా మంది రైతులు వేస వి దుక్కులు దున్నుకుం టారు.
మినీ ట్రాక్టర్..!
సన్న చిన్నకారు రైతులకు మినీ ట్రాక్టర్ ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న కమతా ల్లో రైతులు దీన్ని ఉపయోగించి తమ సొంత పనులను పూర్తి చేసుకుంటారు.
రోటవేటర్..!
ట్రాక్టర్‌కు రోటవేటర్ అమర్చడం వల్ల భూమిని చూరచూర చేస్తుంది. విత్తనాలు నాటేందుకు అనువుగా చదును అవుతుంది.
పవర్ వీడర్..!
పత్తి చేనులో వరుసల మధ్య కలుపు మొక్కలను తొలగించేందుకు గొర్రుగా, గుంటు కగా పవర వీడర ఉప యోగపడుతుంది.
డ్రమ్ సీడర్..!
డ్రమ్ సీడర్‌తో ఎ లాంటి కూలీల అవసరం లేకుండా వరి విత్తనాలు వేసుకోవచ్చు. ఈ పద్దతి ద్వా రా వరి సాగు చేస్తే రైతు కు పెట్టుబడులు తగ్గి అధిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వరి కలుపు యంత్రం..!
వరుసలుగా నాటిన వరి పొలంలో అంతర్ కృషి చేసి కలు పును నివారించేందుకు వరి కలుపు యంత్రాన్ని ఉపయోగిస్తారు.
వరికోత యంత్రం..!
వరిపంట పండించే రైతులకు చెరువుల కింద ఒకేసారి పంట కోతకు రావడం వల్ల కూలీల కొరత ఏర్పడుతుంది. వరిని కోసి మార్పిడి చేయడానికి ఎంతో మంది కూలీలు అవసరం పడతారు. అంతే కాకుండా వరిధాన్యం చేతికి రావడానికి కనీసం 20 రోజులు పడుతుంది. అందుబాటులోకి వచ్చిన వరికోత యంత్రంతో సుమారు రెండు గంటల్లోనే ఎకరం వరిధాన్యం చేతికి వస్తుంది.
పవర్ స్పేయర్..!
మొక్కలు పెరిగి పెద్దవి అయ్యాక చీడపీడల బారినుంచి పం టను రక్షించడానికి క్రిమిసంహారక మందులు మొక్క యొక్క అన్ని భాగాలు తడిచేందుకు పవర్ స్పేయర్ ఉపయోగపడుతుంది.