Home రంగారెడ్డి పాడి రైతుకు చేయూత

పాడి రైతుకు చేయూత

Government Giving to Farmer Subcidy Buffellows

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు రైతన్నకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభు త్వం మరో ముందడుగు వేసింది. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న రంగాలను సైతం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి నిర్ణయించి ఇప్పటికే గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ, మత్సకారులకు చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వం తాజాగా పాడి పరిశ్రమపై దృష్టి సారించింది. రైతులు వ్యవసాయంతో పాటు పాడి గేదెలను పెంచుతూ పాలను విక్రయించి జీవనం సాగిస్తున్నారు. పాడి పరిశ్రమకు అండగా నిలబడటానికి సొసైటీ సభ్యులందరికీ రాయితీపై పాడి గేదెలను అందచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి ప్రవేశపెట్టనున్న పథకం వలన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పాడి రైతులకు ప్రయోజనం కలుగనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 19 బల్క్ మిల్క్ చిల్లింగ్ కేంద్రాలు ఉండగా అందులో ఇప్పటివరకు 546 రిజిస్టర్డ్ సంఘాలుండగా అందులో 9543 సభ్యులున్నారు. ప్రస్తుతం ఉన్న సభ్యులలో 1326 ఎస్‌సి, 1243 ఎస్‌టి సభ్యులుండగా 6997 మంది ఇతరులున్నారు. ప్రభుత్వ పాడి గేదెలను పంపిణీ చేయడానికి తయా రు చేసిన మార్గదర్శకాల ప్రకారం 8777 సభ్యులను లబ్ధిదారులుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. వికారాబాద్ జిల్లాలో 135 సంఘాలుండగా అందులో 2800 మంది పాడి రైతులు సభ్యులుగా కొనసాగుతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 7 సంఘాలుండగా అందులో715 మంది పాడి రైతులు సభ్యులుగా ఉ న్నారు. పాడి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న వారు ఉమ్మడి జిల్లాలో లక్షల సంఖ్యలో ఉన్న సంఘాలలో న మోదు చేసుకున్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది.
ఖుషి ఖుషిగా పాడిరైతులు..
పాడి రైతులకు సబ్సిడిపై గేదెలను అందచేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో పాడి రైతులు కుషి కుషిగా ఉన్నారు. మేలు రకాలైన గేదెలను ఎంపిక చేసుకోవడానికి వీలు కల్పించడంతో పాటు ఒక్క యూనిట్ ఖరీదు 80 వేలుగా ప్రకటించింది. 80 వేల గేదెకు ఎస్సీ, ఎస్టీలు 20 వేలు మాత్రమే కడుతుండగా ప్రభుత్వం మిగత 60 వేలు చెల్లిస్తుంది. ఇతరులకు మాత్రం 40 వేలు ప్రభుత్వం, 40 వేలు లబ్దిదారులు చెల్లించనున్నారు. గొర్రెల పంపిణి సమయంలో ఎదురుకున్న సమస్యలను అదిగమించడానికి గేదెలను రైతులు ఇష్టం వచ్చిన చోట కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ప్రతి గేదెలకు బీమాతో పాటు వైద్య సేవలు, పశువుల దాణ అందచేయడానికి కావలసిన చర్యలను అధికారులు చేపడుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు రాజదాని చుట్టు విస్తరించి ఉండటంతో పాల వ్యాపారంను నమ్ముకుని పెద్ద ఎత్తున జీవిస్తున్నారు. పాల వ్యాపారులకు కాకుండా ప్రభుత్వం చేపడుతున్న పథకం పూర్తిగా రిజిస్టర్ సంఘాలలో సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. రిజిస్టర్ సంఘాలలో సభ్యులు తక్కువ సంఖ్యలో ఉన్నారని వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న రైతులందరికి గేదెలను అందచేయడం వలన రైతులు ఆర్ధీకంగా ఎదగడానికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో రిజిస్టర్ సంఘాలలో ప్రస్తుతం నమోదు అయిన వారితో పాటు కొత్త వారు సైతం నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తుండటంతో లబ్దిదారుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. కలెక్టర్‌ల అద్వర్యలో డెయిరీ సంస్థల అధ్వర్యంలో పంపిణి కార్యక్రమం నిర్వహించనున్నారు. పథకం అమలు జరిగేలా మండల స్థాయిలో తహసీల్దార్‌లు, ఎంపిడిఓ, పశు వైద్యాధికారులు, డెయిరి ప్రతినిధులతో కమిటిని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడానికి ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.