Friday, April 26, 2024

నాయీబ్రాహ్మణులను ఆదుకుంటాం

- Advertisement -
- Advertisement -

Government helping to the Barbers

 

రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో నష్టపోయిన నాయీబ్రాహ్మణుల సమస్యలను దశలవారిగా పరిష్కరించనున్నాట్లు ఆయన నాయిబ్రాహ్మణుల సంఘం నాయకులకు హామీఇచ్చారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కలిసి తమసమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు.

కరోనా వైరస్ విజృంభన, లాక్‌డౌన్ కారణంగా నాయీబ్రాహ్మణులు ఆర్థికంగా నష్టపోయారని సంఘం నాయకులు వినోద్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. నాయీ బ్రాహ్మణుల సమస్యలను తెలుసుకున్న వినోద్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. నాయీబ్రాహ్మణుల సమస్యలను దశలవారిగా పరిష్కరించనున్నట్లు వినోద్‌కుమార్ హామీఇచ్చారు. అలాగే లాక్‌డౌన్‌తో ఆర్థికంగా నష్టపోయిన నాయీబ్రాహ్మణులకు విద్యుత్ రాయితీలు, పనిముట్లను అందిచాలని సంఘం ప్రతినిధుకు చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. వినోద్ కుమార్‌ను కలిసిన వారిలో నాయీసంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మోహన్, గ్రేటర్ హైదరాబాద్ ఇన్‌ఛార్జీ జితేందర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News