Home మంచిర్యాల ప్రభుత్వ భూముల స్వాహా

ప్రభుత్వ భూముల స్వాహా

land

* అక్రమార్కుల చేతుల్లో అసైన్డ్ భూములు
* లెక్కకు మించి భూముల పంపిణీ
* భూ ప్రక్షాళనలో వెలుగు చూస్తున్న అక్రమాలు

వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లాయి. రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడి అప్పనంగా ప్రభుత్వ భూములను ఇచ్చేశారు. గతంలో రెవెన్యూ అధికారులు పైరవీకారులకు పెద్దపీట వేసి, ప్రభుత్వ భూములను కట్టబెట్టగా భూముల ప్రక్షాళనలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కరి పేరిట 50 ఎకరాల భూములు ఉన్నట్లుగా సర్వేలో అక్రమాలు వెలుగు చూశా యి. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15 నుంచి మూడు విడతలుగా భూముల ప్రక్షాళన చేపట్టింది. మంచిర్యాల జిల్లాలోని 17 మండలాల్లో జరిగిన భూముల ప్రక్షాళనలో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. డిసెంబర్ నెలాఖరు వరకు జరగనున్న భూముల ప్రక్షాళనలో భాగంగా వివాదాలు, కోర్టు కేసులు తగాదాలు ఉన్న భూములను కేటగిరి -బి కిందకి గుర్తించి వాటిని పక్కన బెట్టి వివాదరహిత భూముల రికార్డులను సరిచేసి, ఎ కేటగిరి కింద గుర్తించారు. భూముల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారి నివేదికలు సిద్దం చేసి, పూర్తయిన గ్రామాల్లో అతికించారు. గతంలో పని చేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ అసైన్డ్ భూములను ఏవిధంగా పరులకు కట్టబెట్టారో అర్థం అవుతుంది. పేద ప్రజల కోసం పంపిణీ చేసే వందలాది ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారినట్లుగా కనిపిస్తోంది. జిల్లాలోని 17 మండలాల్లో దాదాపుగా 15 వందల ఎకరాల అసైన్డ్ భూములు లబ్దిదారులకు కాకుండా పరుల చేతుల్లోకి వెళ్లాయని తెలుస్తోంది. ప్రభుత్వం పేద ప్రజలకు అసైన్డ్ చేసిన భూములు 724 మంది  లబ్ధి దా రులు కాని వారు సాగు చేస్తు న్న ట్లుగా వెలుగు చూసింది. కోట పల్లిలో 36, చెన్నూ ర్‌లో 45, కన్నె ప ల్లిలో 13, జన్నా రంలో 83, మంద మర్రిలో 47, హాజీ పూ ర్‌లో 25 మంది లబ్ది దా రులు కాని వారు స్థానిక రెవెన్యూ అధి కా రుల అండ దం డ లతో ప్రభుత్వ అసైన్డ్ భూము లను సాగుచేసు కుం టు న్నారు. తాండూర్ మండల కేంద్రంలో సర్వే నెం. 104లోగోపా ల్ న గర్ గిరి జ నులు, తాండూర్ దళి తు లకు ఒక్కొక్క కుటుం బా నికిమూడు ఎక రాల చొప్పున భూము లను పంపిణీ చేస్తే ఇక్కడ దశాబ్ద కాలంగా వారికి సెంట్ భూమి కూడా కని పిం చక పట్టాలు చేత పట్టు కొనిరెవెన్యూ కార్యా లయం చుట్టూ ప్రద క్షి ణలు చేస్తు న్నారు. అసైన్డ్ భూములపై రెవెన్యూ అధి కా రుల నిర్ల క్షంతో పాటు అక్ర మా ర్కు లకు అండగాఉండ డంతో ప్రభుత్వ భూములు పరుల చేతు ల్లోకి వెళ్తు న్నాయి. ఆరేళ్లకిందటి వరకు ప్రభుత్వ భూము లను ఎవరు పట్టిం చు కో క పోగా ప్రస్తుతం భూముల ధరలు పెర గ డంతో కొందరు అక్ర మా ర్కులు ప్రభుత్వభూము లపై కన్నే శారు. మరో వైపు రెవెన్యూ అధి కా రుల కూడా మామూళ్లకు అల వాటు పడి ప్రభుత్వ భూము లను వారి పేరిట పట్టాలు పంపిణీచేస్తు న్నారు. తాండూర్ మండలం నర్సా పూర్ శివా రులో సర్వే నెం. 35లో మొత్తం 1283.21 ఎక రాల భూమి ఉండగా అందులో అట వీ శా ఖకు కొంత భూమి అప్ప గిం చారు. కాగా 132 ఎక రాల భూము లను అక్రమా ర్కులు కబ్జా చేశారు. జిల్లా వ్యాప్తంగా 2718 సర్వే నెంబ ర్లలో గలభూము లను మోకాపై ఉన్న భూముల కంటే ఎక్కువ భూములు ఉన్న ట్లుగా అధి కా రులు గుర్తిం చారు. అంతే కాకుండా ఎలాంటి భూములు లేకుండా 85 మందికి పట్టాలు జారీ చేయగా వారు భూములు చూపిం చాలని రెవెన్యూ అధి కా రుల చుట్టు ప్రద క్షి ణలు చేస్తు న్నారు. ఈ విష యమైజాయింట్ కలె క్టర్ సుధా క ర్ రా వును వివ రణ కోరగా అసైన్డ్ భూములవ్యవ హా రంలో తగిన చర్యలు తీసు కుం టు న్నా మ న్నారు. పరుల చేతుల్లోఉన్న అసైన్డ్ భూముల ఖాతాలు ఎలాంటి ఉత్త ర్వులు లేకుండా పట్టాలుఇచ్చిన భూము లను బి కేట గిరి కిందకి చేర్చి పెండిం గ్‌లో ఉంచా మ న్నారు. ప్రజా ప్రతి ని ధులు, అక్ర మా ర్కులు స్వాధీనం చేసు కున్న ప్రభుత్వఆసైన్డ్ భూము లపై విచా రణ జరిపి చర్యలు తీసు కుం టా మ న్నారు.