Home జాతీయ వార్తలు ఫలిస్తున్న ఆందోళన

ఫలిస్తున్న ఆందోళన

Arun-Jaitly_manatelangana copyలోక్‌సభలో తెరాస ఎంపీల మౌన నిరసనకు ప్రతిఫలం దక్కింది. హైకోర్టు విభజన డిమాండ్‌పై మంగళవారం నాడు జీరో అవర్‌లో చర్చకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారు. చర్చను ఆసక్తితో విన్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెరాస ఎంపిలను తన కార్యాలయానికి పిలిపించుకొని వారితో మాట్లాడారు.

ఎట్టకేలకు లోక్‌సభలో చర్చ అరుణ్‌జైట్లీతో తెరాస ఎంపీల భేటీ
మన తెలంగాణ / న్యూఢిల్లీ : లోక్‌సభలో తెరాస ఎంపిల మౌన నిరసనకు ప్రతిఫలం దక్కింది. కాళ్లు పీకుతున్నా లెక్క చేయకుండా గంటల తరబడి ప్లకార్డులు చేతబూని గత కొన్ని రోజులుగా లోక్‌సభలో నిరసనలు తెలుపుతున్న టిఆర్‌ఎస్ ఎంపిల డిమాండ్‌కు చివరకు స్పీకర్ సుమిత్రా మహాజన్ తలొగ్గారు. హైకోర్టు విభజనపై చర్చకు అంగీకరించారు. ఏకంగా ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎంపిలను బహిష్క రించిన తర్వాత టిఆర్‌ఎస్ ఎంపిల దూకు డుకు కళ్లెం పడుతుందనుకున్న అధికార పార్టీ అంచనాలను తారుమారు చేస్తూ మంగళవారం సభ ప్రారంభంకావడాని కంటే ముందే టిఆర్‌ఎస్ లోకసభ ఫ్లోర్‌లీడర్ జితేందర్‌రెడ్డి హైకోర్టు విభజనపై చర్చకు అనుమతించాలని కోరుతూ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కార్యాలయానికి అందిం చారు. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభంకాగనే స్పీకర్ ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఎప్పటి మాదిరిగానే ప్లకార్డులు చేతబూని తెరాస ఎంపిలు తమ స్థానాల్లోంచి లేచి మౌన నిరసనకు తెరలేపారు. పరిస్థితి గమనించిన కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జోక్యం చేసుకున్నారు. తెలంగాణకు అన్యా యం జరగనివ్వబోమని విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్టును త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఎంపిలు నిరసనకొనసాగించడంతో జీరో అవర్‌లో హైకోర్టు విభజనపై చర్చకు స్పీకర్ అనుమతించారు. ముందు మైకు అందు కున్న ఎంపి జితేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తి పోశారు. హైకోర్టు విభజి స్తామంటూ నాలుగు పార్లమెంట్ సమా వేశాలను నెట్టుకొచ్చారు. ప్రధాని మోడీతో పాటు, కేంద్రహోంమంత్రి కూడా త్వరలోనే హైకోర్టు విభజన సాకారం అవు తుందని మాటిచ్చారు. అయినా ఎందుకు జాప్యం జరుగుతోందో కేంద్రం సమాధానం చెప్పాలి. గతంలో మా నిరసనలతో స్పందిం చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి ఏకంగా మా ఎంపీలందరిని తన ఇంటికి పిలిపించు కొని మాట్లాడారు. మరో నెల రోజుల్లో విభజన ప్రక్రియ పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు. అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఉమ్మడి హైకోర్టు విభజన కోసం ఒక్క తెలంగాణ న్యాయవాదులే కాదు అటు ఏపీ న్యాయవాదులు కూడా పోరాడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టిలో పెట్టుకోవాలి. తమకు అన్యాయం జరిగిందని భావించిన వారంతా హైకోర్టును న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. ఇందులో ఒక్క రాజకీయ నాయకులే కాదు. వ్యా పారులు, ఉద్యోగులు ,సామాన్యులు అంతా ఉంటారు. అయితే ఇప్పుడున్న ఉమ్మడి హైకోర్టులో మొత్తం 29 మంది జడ్జీలుంటే అందులో 25 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెంది న వారే ఉన్నారు. ఇక మాకు ఎలా న్యాయం జరుగుతుందో చెప్పండి. హైకోర్టులో మాకు న్యాయం జరగడం లేదని ఒక్క తెలంగాణ సర్కారే కాదు. మొత్తం తెలంగాణ సమాజం ఘోషిస్తోంది. హైకోర్టు విభజనలో జాప్యం కారణంగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగు తోంది. కిందటి ఎన్డీయే హయాంలో కొత్తగా ఏర్పడిన మూడు కొత్త రాష్ట్రాలకు వెంటనే హైకోర్టును ఏర్పాటు చేశారు. కాని తెలంగాణ విషయంలోనే ఏందుకు అల సత్వం వహిస్తున్నారు. పన్నెండేళ్ల తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ ఒక్కరికి బుల్లెట్ తగల లేదు. ఏ సీమాంధ్ర వాసి రక్తం చిమ్మలేదు. మా పిల్లలు ఆత్మహత్యలు చేసు కున్నారే కాని సీమాంధ్రలను ముట్టు కోలేదు. ఇప్పుడు ఎంపీలమైన మేం పది మంది కూడా కష్టానికి ఓర్చి గంటల తరబడి మౌన నిరసన చేస్తున్నామే కాని సభను అడ్డుకోవడం లేదు. రాజ్యాంగ బద్ధంగా వచ్చిన హక్కుతో పాటు విభజన చట్టంలో లభించిన హామీ మేరకు ప్రత్యేక హైకోర్టు కోరుతున్నాం. కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. కేంద్రం వెంటనే స్పందించాలి అంటూ తీవ్రస్తాయిలో కేంద్రంపై సభలో విరుచుకుపడ్డారు. చర్చలో జితేందర్‌రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించిన స్పీకర్ దీనిపై స్పందించాలని కేంద్రాన్ని కోరారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరుకు వెళ్లడంతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారు. తెరాస కోరినదాంట్లో న్యా యం ఉందని ఒప్పుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యల దృష్టా జాప్యం జరుగుతోందని, సమస్యలను అధిగ మించేందుకు కేంద్ర న్యాయశాఖ కృషి చేస్తోందని చెప్పారు. వెంకయ్యనాయుడు సమాధా నంపై ఎంపి వివేక్ మాట్లాడుతూ కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే క్షణాల్లో విభజన ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. ఎపి హైకోర్టుకు హైద రాబాద్‌లో కొనసాగేందుకు అవ సరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏకంగా తెలంగాణ సర్కారు లిఖిత పూర్వ కంగా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఎందు కు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. జితేందర్‌రెడ్డి, వినోద్‌ల ప్రసంగా లను ఆసక్తిగా ఆలకించిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అసలు విషయం పట్టనట్లున్నారు. భోజన విరామం కోసం సభ వాయిదా పడగానే తెరాస ఎంపీలతో తన కార్యాల యానికి రావాలని జితేందర్‌రెడ్డిని కోరారు.