Home వరంగల్ ప్రజల భాగస్వామ్యంతో సర్కార్ బడులకు పూర్వ వైభవం

ప్రజల భాగస్వామ్యంతో సర్కార్ బడులకు పూర్వ వైభవం

ఎడ్యుకేషన్ హబ్‌గా వరంగల్, జూన్ 20 వరకు బడిబాట
296 మందికి ట్రిపుల్ ఐటి సీట్లు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి

                     School

వరంగల్‌బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సౌకర్యాలను కల్పించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రజలందరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. జూన్ 13 నుంచి 20వరకు జరుగుతున్న రెండవ బడిబాట కార్యక్రమంలో భాగంగా హంటర్‌రోడ్‌లోని న్యూశాయంపేట పాఠశాలలో జరిగిన బడి బాట కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ఫలితా లను సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు, ట్రిపుల్‌ఐటిలో అడ్మిషన్ పొందిన విద్యార్థుల ను కడియం శ్రీహరి సత్కరించారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్షం మూలంగా ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్నంగా తయారయ్యాయ న్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి అన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌళిక సౌకర్యా లను కల్పించి నూతన హంగులతో అభివృద్ధి చేయడం జరుగుతుందని, డిజిటల్ తరగతు లు, ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాణ్యమైన విద్య గురుకులాల ద్వారానే సాధ్యమని రాష్ట్రంలో 510 గురుకుల పాఠశాలలను మంజూరు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 296 మంది విద్యార్థులు ట్రిపుల్‌ఐటిలో సీట్లు సాధించడం అభినందనీయమని, ప్రభుత్వ పాఠశాలల నాణ్యతకు నిదర్శనమన్నారు.

ఎడ్యుకేషన్ హబ్‌గా వరంగల్

వరంగల్ అర్బన్ జిల్లాను ఎడ్యూకేషన్ హబ్ గా, విద్యారంగంలో మోడల్ జిల్లాగా తీర్చిదిద్ద డానికి చర్యలు చేపడతామన్నారు. అత్యున్నత విద్యా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు వరంగల్ అర్బన్ జిల్లాలో అన్ని పాఠశా లల్లో మౌళిక సౌకర్యాల కల్పన, అదనపు క్లాస్ రూముల ఏర్పాటుకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేశామని
శాయంపేట ప్రభుత్వ పాఠశాలలో 50లక్షల రూపాయల తో అదనపు క్లాస్‌రూములు, మౌళిక సదుపాయాల కల్పన కు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మరోపాఠశాల గది, 12 కంప్యూటర్లు మంజూరు చేస్తున్నామని కడియం ప్రకటించారు.
విద్యకు అత్యంత ప్రాధాన్యత
వరంగల్ ఎంపి పసునూరి దయాకర్
school-3

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వరంగల్ ఎంపి పసునూరి దయాకర్ అన్నారు. విద్యకు అధికంగా నిధులను కేటాయించడంతోపాటు గురుకుల పాఠశాలల మంజూరు, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సన్న బియ్యం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులకు ఎక్కువగా ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడం అభినందనీయమన్నారు.
– 65 పాఠశాలలకు రూ. 7.35 కోట్ల మంజూరు
దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 65 పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు 7కోట్ల 35లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింద న్నారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడం జరుగుతుందన్నారు. పాఠశాలల అభివృద్ధితోపాటు మానిటరింగ్ చేసుకునే విధం గా చర్యలు తీసుకుంటామని అన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ కాట అమ్రపాలి మాట్లాడుతూ ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు, విద్యార్థుల సహకారం, సమన్వయ భాగ స్వామ్యంతో పాఠశాలలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు విద్యార్ధి దశలో ప్రతి సంవత్సరం విధిగా మొక్కలు నాటడడం, పాఠ్యపుస్తకా లతో సంబంధంలేకుండా ఏడాదికి పది విలువలతో కూడిన పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, విద్యాశాఖ అదనపు సంచాలకులు రమణకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసాచారి, డిఈ రవీందర్‌రావు, స్థానిక కార్పొరేటర్లు మాధవి, అరుణ తదితరులు పాల్గొన్నారు.