మన తెలంగాణ/తొర్రూరు : కోటి ఆశలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ కి ప్రజలు పట్టం కడితే ఇచ్చిన హామీలను అమలు పరచడం లో పూర్తిగా విఫలమైందని కాం గ్రెస్ శాసనసభా పక్షనేత కె. జానారెడ్డి అన్నారు. గురువా రం డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే నిధులు, నియామకాలు, నీళ్ళు అన్ని మనవే అని, మన ఉద్యోగాలు మనకే అని చెప్పి ప్రజలకు హామి ఇచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని అమలు పర్చడంలో విఫలమైందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు ఆపార్టీకి బుద్ది చెబుతారని ఆయన విమర్శించారు. సోనియాగాంధీ, యుపిఎ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని ఇస్తే అది నేడు కుటుంబ పాలనకే అంకితమైందని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వీరికి 2019 ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు. అధికారంలోకి వస్తే రైతులకు ఋణమాఫీని నాలుగు విడుతలుగా చేపడుతామని చెప్పి చేతులు దులుపుకున్నారని, ఋణమాఫి అయినా కూడా రైతు ఖాతాలలో బాకీ అలాగే ఉంటుందని, ఎంతోమంది రైతులు పెట్టుబడులు పెట్టలేక, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ఈప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెండు పడక గదుల ఇళ్ళు, దళితులకు భూపంపిని, రిజర్వేషన్ల లాంటి హామీలు అమలు కావని తెలిసినా ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలు ఇచ్చారని, కాంగ్రెస్ హాయంలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ళు బిల్లులను నేటి వరకు 30 శాతం కూడా చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు గిట్టుబాటు ధర అడిగితే వారిపై లాఠీచార్జిలు, అరెస్టులు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే విరుద్దమని ఆయన అన్నారు. ఎర్రజొన్నలు, సన్నబియ్యం పేరుతో ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుతున్నారని ఇది సరికాదన్నారు. రాష్ట్రం ఏర్పడితే 500 జనాభాగల తం డాలను గ్రామ పంచాయతిలుగా మారుస్తామని చెప్పి నేటి వరకు అమలు కాలే దన్నారు. గిరిజనుల ఆరాద్యదైవం సంతూ సేవాలాల్ 259వ జయంతి వేడుకల సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో మహబాదు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, కాంగ్రెస్ సమన్యకర్త జంగా రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.