Home తాజా వార్తలు కోదండరాంను ఒంటిరి చేయాలని చూస్తున్నారు…

కోదండరాంను ఒంటిరి చేయాలని చూస్తున్నారు…

Palvayi-Govardhan-Reddyహైదరాబాద్ : తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాంను ప్రభుత్వం ఒంటరి చేయాలని చూస్తోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇలాంటి విధానాన్ని ప్రజలు సహించరన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటల గారడీతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ కాకుండా బూడిద తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో పెంచిన అంచనాల్లో ఎన్ని ముడుపులు అందాయో కెసిఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నేతలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి షోకాజ్ నోటీసులు అందలేదని స్పష్టం చేశారు.