Home జగిత్యాల రైతుకు సంపూర్ణమైన సహకారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

రైతుకు సంపూర్ణమైన సహకారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

Farmer

 

జగిత్యాల : రైతుకు సంపూర్ణమైన సహకారం అందించి వ్యవసాయ రంగాన్ని గొప్ప గంగంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నూతనంగా నియమించిన వ్యవసాయ మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్, పెద్దపెల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దావ వసంతలు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్బంగా ఈశ్వర్ మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన మార్కెట్ కమిటి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిటిపై గురుతరమైన భాద్యత పెరిగిందని, రైతులకు అందుబాటులోఉండి రైతులకు ఆదాయం పెంచే విదంగా న్యాయ బద్దంగా పనిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన నుండి రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దేశంలో ఎక్కడ లేనివిదంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బందు, రైతు బీమ అమలు చేస్తున్నామన్నారు.

రైతులు దాన్యం నిలువ చేసేందుకు తెలంగాణ ప్రాంతంలో కేవలం 400 మెట్రిక్ టన్నుల గోదాములు మాత్రమే ఉండేవని, రాష్ట్రం ఏర్పడిన నుండి నేటి వరకు 24వేల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించామన్నారు. రైతుల సౌకర్యం కోసం ప్రతి గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కొనుగోలు చేసిన దాన్యానికి 48గంటల్లోగా డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. తాను ధర్మపురికి వచ్చిన కొత్తలో త్రాగు సాగు నీటి అనేక సమస్యలుండేవన్నారు. గోదావరి ఒడ్డు పొడువున ఎత్తి పోతల పథకాలు ఏర్పాటు చేసుకుని 80వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నామన్నారు. అదే విదంగా బీర్‌పూర్ మండలంలోని రోళ్ల వాగును ఆదునీకరించడం ద్వారా త్రాగు, సాగు నీటి సమస్య పరిష్కారమైందన్నారు. వేసవి కాలంలో 6టిఎంసి డెడ్ స్టోరేజ్ తో ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవ పథకం ద్వారా నేడు ఎస్‌ఆర్‌ఎస్‌పి కళకలాడుతుందన్నారు.

దాని వల్ల 32780 హెక్టార్లలో పంట సాగు పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ అయ్యోరి రాజేష్‌కుమార్, వైస్ చైర్మన్ అక్కెనపెల్లి సునిల్‌కుమార్, ధర్మపురి ఎంపిపి ఎడ్ల చిట్టిబాబు, జడ్పిటీసీ బత్తిని అరుణ, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, మండల కోప్షన్ సబ్యులు కైసర్, మార్కెట్ కమిటి డైరెక్టర్లు షెపెల్లి పోచమల్లు, సిగిరి భూమరెడ్డి, దేవి అంజలి, లింగం వెంకటేశ్వర్‌రెడ్డి, ఎండి ఇక్రం, తాడెపు లింగన్న, బోరె శంకర్, రేగొండ నారాయణ, కార్యదర్శి తన్నీరు రాజశేకర్, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Government’s Goal is to give Farmer fullest support